ఈ ఏడాది బాబాయ్.. వచ్చే ఏడాది అబ్బాయి.. డబుల్ ట్రీట్!
on Jan 10, 2023

2022లో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ఒక చిత్రం కూడా విడుదల కాలేదు. అఖండ చిత్రం 2021 డిసెంబర్ లో విడుదల అయింది. కానీ కిందటేడాది ఆయన నటించిన చిత్రాలు ఏవి విడుదల కాలేదు. కానీ ఈ ఏడాది మాత్రం ఆయన సంక్రాంతికి వీరసింహారెడ్డి గా వస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఆ వెంటనే ఆయన అనిల్ రావిపూడి తో సినిమాను పట్టాలెక్కించునున్నారు. ఈ సినిమా షూటింగును కూడా నిర్విరామంగా పూర్తి చేసి ఇదే ఏడాది వేసవి లేదా దసరా కానుకగా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.
ఆ విధంగా చూసుకుంటే ఈ ఏడాది బాలయ్య తన అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇంకా వచ్చే ఏడాది అబ్బాయి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. సర్వం సిద్ధమైన సరే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ చిత్రం సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. దర్శకుడు కొరటాల శివ రెడీగా ఉన్నాను అని ముందే చెప్పేశారు. కానీ తారక్ మాత్రం ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా రిలాక్స్డ్ గా ఉన్నారు. 30వ సినిమా కథ విషయంలో కొంత జాప్యం జరిగినప్పటికీ రెండు నెలల కిందటే తుది స్క్రిప్ట్ రెడీ అయింది.
సినిమా లాంచింగ్ మాత్రం ప్రారంభించలేదు. తాజాగా కొత్త ఏడాదిలో అంటే 2024 లో ఏప్రిల్ లో వేసవి కానుకగా 30వ చిత్రం విడుదల చేయనున్నామని చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. దీంతో అభిమానులకు క్లారిటీ వచ్చేసింది. వచ్చే ఏడాది వరకు ఆయన సినిమాల గురించి మాట్లాడుకోవాల్సిన పనేలేదు. ఏడాదంతా షూటింగ్ సహా నిర్మాణాంతర పనులు ఉంటాయి. అయితే ఆ సమయాన్ని కూడా యంగ్ టైగర్ విశ్రాంతికి వాడుకోవడం లేదు. అభిమానులకు డబుల్ బొనాంజా రెడీ చేస్తున్నారు. కేజీఎఫ్ ఫ్రాంచైజీ ఫేమ్ ప్రశాంత్ నీల్ చిత్రాన్ని కూడా ఇదే ఏడాది చివర్‌లో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.
ఎలా లేదన్న సలార్ షూటింగ్ ఈ ఏడాది ప్రధమార్ధంలో పూర్తయిపోతుంది. అటుపై ప్రశాంత్ నీల్ ఖాళీ అవుతారు. ఈ నేపథ్యంలో తారక్- కొరటాల శివ తో పాటు ఒకేసారి ప్రశాంత్ నీల్ ప్రాజెక్టును కూడా పట్టాలెక్కించాలని భావిస్తున్నారట. దీనికి సంబంధించిన అప్డేట్ త్వరలో రానుందని తెలుస్తోంది. ఈ ఏడాది మధ్యలో గానీ చివర్‌లో గాని షూటింగ్ ప్రారంభించిన 2024 ఏడాది చివరి లోపల ఈ చిత్రాన్ని కూడా థియేటర్లోకి తీసుకురావచ్చు అనేది యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్లాన్ గా తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



