ENGLISH | TELUGU  

త‌ల‌పతి పొంగల్ రేసులోనే కాదు... దీవాలి రేసులో కూడా ఉన్నాడు!

on Jan 10, 2023

కోలీవుడ్ లో  త‌ల‌పతి విజయ్ ది ప్రత్యేకమైన శైలి. ఆయన ఒక సినిమా విడుదలయ్యే కంటే ముందుగానే వెంటనే మరొక సినిమాను మొదలు పెడుతూ ఉంటారు.  మధ్యలో పెద్దగా గ్యాప్ తీసుకోరు.  సినిమా సినిమాలకు ఎక్కువ గ్యాప్ ఉండడం ఆయనకు ఏ మాత్రం ఇష్టం ఉండదు. ఒకసారి దర్శకుని నమ్మితే పూర్తిగా అతని ఫాలో అయిపోతారు.  ఏదైనా సరే స్క్రిప్ట్ దశలోనే ఫైనల్ చేసుకొని ఆపై మారు మాట్లాడకుండా డైరెక్టర్ చెప్పినట్టు చేసుకుంటూ పోవడమే విజయ్ పని.  విజయ్ ఒక్కసారి ఒప్పుకున్నారు అంటే ఆ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని తపన పడుతూ ఉంటారు. నిర్మాతల‌కు  కూడా ఖర్చులను తగ్గించడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. 

ఇక ఈ పొంగల్ రేసులో విజయ్ వారీసు సినిమా విడుద‌ల  అవుతున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో పొంగల్ తర్వాత దీపావళికి అంతటి ప్రాధాన్యం ఇస్తారు. ఇక్కడ సంక్రాంతి తర్వాత దసరాకు ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో తమిళనాడులో పొంగ‌ల్  తరువాత దీపావళికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఇక విజ‌య్ తో  లోకేష్ కనకరాజు తమిళ ఇండస్ట్రీలో నెవర్ బిఫోర్ అనేలా ఒక అతి పెద్ద మల్టీవర్సును క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసింది. విజ‌య్ తో అతను మాస్టర్ క్యారెక్టర్ ను కంటిన్యూ చేస్తారా లేదంటే మరో కొత్త క్యారెక్టర్ సృష్టిస్తారా?  అనేది ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తానికి లోకేష్ కనకరాజు కూడా ఈ చిత్రంపై ఇప్పుడు అహర్నిశలు చేస్తున్నారు.  తలపతి 67వ సినిమా ఏడాది సమ్మర్ లోపు ఫినిష్ చేయాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు.

ఈ సినిమా ఇదే ఏడాది దీపావళికి విడుదల చేయాలని అనుకుంటున్నారట. లోకేష్ కూడా ఆలస్యం చేయకుండా షూటింగ్ పనులను పూర్తి చేయడంలో ముందుంటారు.  ఆయన ఏకంగా కమలహాసన్ తో  విక్రమ్ సినిమాను అనుకున్న సమయం కంటే ముందుగానే పూర్తి చేశారు.  ఇక విజయ 67వ సినిమా కూడా అనుకున్నంత తొందరగా ఫినిష్ చేయాలని లోకేష్ కనకరాజు భావిస్తున్నారు.  దీనికి విజయ్ సపోర్ట్ ఎలాగూ ఉంటుంది. కాబట్టి ఈ ఏడాది తలపతి విజయ్ నుంచి వారి అభిమానులకు డ‌బుల్  ట్రీట్ ఖాయమని చెప్పాలి....!

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.