కిరణ్ అబ్బవరం సినిమాకి డైరెక్టర్ మారిపోయాడు
on Jul 11, 2022

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' టీజర్ తాజాగా విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. అయితే ఈ సినిమాకి దర్శకుడు మారిపోవడం ఆసక్తికరంగా మారింది.
ఇప్పటిదాకా కిరణ్ హీరోగా నటించిన నాలుగు సినిమాలు విడుదల కాగా, ఆ నాలుగు సినిమాలకు కూడా నలుగురు కొత్త దర్శకులు పని చేయడం విశేషం. అలాగే ఐదో సినిమా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' కూడా కార్తీక్ శంకర్ అనే కొత్త దర్శకుడితో చేస్తున్నట్లు ప్రకటించాడు కిరణ్. మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కూడా దర్శకుడిగా కార్తీక్ శంకర్ పేరే కనిపించింది. కానీ తాజాగా విడుదలైన టీజర్ లో డైరెక్టర్ పేరు మారిపోయింది. దర్శకుడిగా 'SR కళ్యాణమండపం' ఫేమ్ శ్రీధర్ గాదె పేరు దర్శనమిచ్చింది.

మొదటి రెండు సినిమాలు 'రాజావారు రాణిగారు', 'SR కళ్యాణమండపం'తో ఆకట్టుకున్న కిరణ్.. ఆ తర్వాత వచ్చిన 'సెబాస్టియన్', 'సమ్మతమే' చిత్రాలతో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. అందుకే ఇలా వరుసగా కొత్త దర్శకులతో రిస్క్ చేయడం కంటే, తనకు ఇప్పటికే హిట్ ఇచ్చిన శ్రీధర్ గాదెతో వర్క్ చేయడం బెటర్ అని కిరణ్ భావించాడట. మరోవైపు తన సినిమాలకు కిరణ్ రచయితగా కూడా పని చేస్తున్నాడు. 'SR కళ్యాణమండపం'కు స్టొరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తనే అందించడం విశేషం. ఇప్పుడు 'నేను మీకు బాగా కావాల్సినవాడిని'కి కూడా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. తన రైటింగ్ ని, బాడీ ల్యాంగ్వేజ్ ని శ్రీధర్ బాగా అర్థం చేసుకొని మంచి ఔట్ పుట్ ఇస్తాడన్న ఉద్దేశంతోనే కార్తీక్ ని తప్పించి, శ్రీధర్ ను తీసుకోచ్చాడన్న ప్రచారం జరుగుతోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



