ఆషాఢంలో దీపికతో సుధీర్ అరాచకం!
on Jul 11, 2022

బుల్లితెర జంట సుడిగాలి సుధీర్, రష్మీ ఎంతో పాపులర్. నిన్న మొన్నటి వరకు వీళ్ళిద్దరూ జంటగా చేసిన షోలే ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు రష్మీని వదిలేసి దీపికా పిల్లితో రొమాన్స్ చేస్తూ కనిపించాడు సుధీర్. బుల్లితెర మీద ఇప్పుడు వీళ్లిద్దరే హాట్ టాపిక్. జబర్దస్త్ లో సుధీర్ పంచులతో, రష్మీ తన అందంతో ఎంతో ఆకట్టుకునేవారు. ఏమయ్యిందో ఏమో కానీ సుధీర్ జబర్దస్త్ ని, శ్రీదేవి డ్రామా కంపెనీని వీడి వచ్చేసాడు. కానీ రష్మీ మాత్రం ఇంకా అక్కడే ఉండిపోయింది. సుధీర్ ఇటు కొత్త షోలు, అటు సినిమాలు, ఇంకో వైపు ఈవెంట్స్ తో రష్మీని కూడా పట్టించుకోనంత బిజీగా మారిపోయాడు.
దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు సమర్పణలో "వాంటెడ్ పండుగాడ్" మూవీలో సుధీర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆయనతో పాటు జబర్దస్త్ గ్యాంగ్ నుంచి అనసూయ, దీపికా పిల్లి, విష్ణు ప్రియ వంటి వాళ్ళు కూడా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఇక ఈ మూవీలో సునీల్ ఓ మెయిన్ రోల్ లో నటిస్తున్నాడు. ఈ మూవీ టీజర్ ఇటీవల రీలీజ్ అయ్యింది. జైలు నుంచి పారిపోయిన పండుగాడు అంటే సునీల్ కోసం వెతికే కాన్సెప్ట్ లో తీసిన మూవీ ఇది. అతన్ని పట్టుకుంటే కోటి రూపాయలు ఇస్తామని ప్రకటన చూసి పండుగాడిని పట్టుకోవడానికి అందరూ అడవిలోకి వచ్చి వెతుకుతూ ఉంటారు. ఈ అడవిలో జరిగే సన్నివేశాలు ఆడియన్స్ ని బాగా అలరిస్తారు. ఈ మూవీలో అనసూయ గిరిజన మహిళగా కనిపించబోతోంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే సుధీర్, దీపికా పిల్లితో కలిసి రొమాన్స్ చేస్తూ ఉంటాడు.
అడవిలో వీళ్లిద్దరి ప్రేమ పాటలు ఆసక్తిగా మారాయి. ఐతే సుధీర్ రొమాన్స్ కానీ, ఏదైనా సరే రష్మితోనే బాగుటుంది అంటున్నారు సుధీర్ ఫాన్స్. ఐతే మరో పక్క రష్మీ పరిస్థితి ఏమిటి అంటూ కూడా కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు ప్రస్తుతం 'పార్టీ చేద్దాం పుష్ప' షోకి హోస్ట్ గా చేస్తున్న సుధీర్.. దీపికాతో కలిసి బుల్లితెర మీద కూడా స్టెప్పులేసి రష్మీకి కోపం తెప్పిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



