మేం కలిసే ఉన్నాం..కలిసే ఉంటాం..మీరేం బాధపడకండి
on Aug 27, 2022

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన వ్యక్తుల్లో చెప్పుకోదగ్గ మనిషి కృష్ణవంశీ. గులాబీ మూవీతో ఒక ప్రామిసింగ్, ల్యాండ్ మార్క్ డైరెక్టర్ గా ఆయన పేరు తెచ్చుకున్నారు. తీసినవి కొన్ని చిత్రాలే ఐనా వాటి డెప్త్ గురించి ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంటారు ఆడియెన్స్. అలాంటి వాటిల్లో నిన్నే పెళ్ళాడతా, ఖడ్గం చిత్రాలు సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. మూవీస్ అన్నాక హిట్స్ ఉంటాయి ఫ్లాప్స్ కూడా ఉంటాయి. ఈ రెండిట్లో ఏది వచ్చినా స్థిరంగా ఉన్నవాడు గొప్పవాడు అంటారు..అలాంటి డైరెక్టర్ కూడా కృష్ణవంశీ. చంద్రలేఖ, మురారి, సింధూరం, చందమామ, అంతఃపురం, మహాత్మా ఇలాంటి ఎన్నో హిట్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి.. ఐతే నక్షత్రం, శ్రీఆంజనేయం, గోవిందుడు అందరివాడేలే వంటి మూవీస్ పెద్దగా హిట్ కాలేదు. దాంతో 2017 నుంచి ఒక లాంగ్ గ్యాప్ తీసుకుని ఇప్పుడు మళ్ళీ ఆడియన్స్ ని అలరించడానికి "రంగమార్తాండ" మూవీతో రాబోతున్నారు. ఈ మూవీలో కృష్ణవంశీ భార్య అందాల నటి, శివగామిగా శాసించిన రమ్యకృష్ణ ఒక కీ రోల్ ప్లే చేస్తోంది. ఈ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఇంటర్వూస్ లో పాల్గొంటున్నారు.
ఇటీవల ప్రసారమైన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. చంద్రలేఖ మూవీ రీమేక్ లో రమ్యకృష్ణ నటించింది. ఆ మూవీ తర్వాత కృష్ణవంశీ, రమ్యకృష్ణ వివాహం చేసుకున్నారు. మళ్ళీ ఇన్నాళ్లకు వస్తున్న మరో రీమేక్ రంగమార్తాండలో ఆమె నటిస్తోంది. "దేశం గర్వించదగ్గ నటిగా రమ్యకృష్ణ ఎదిగిన తీరు చూస్తే మీకేమనిపిస్తుంది" అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు " చాలా హ్యాపీగా ఉంటుంది నాకు..కానీ నేను తనని ఇంతవరకు రీచ్ కాలేకపోయాను..ఇప్పుడు ఈ మూవీతో తనతో సమానమవుతానని అనుకుంటున్నా" అని చెప్పారు. మరి "మీరు అంత ప్రేమించిన రమ్యకృష్ణని చెన్నైలో ఉంచి మీరు హైదరాబాద్ లో ఉండేసరికి చాలా రూమర్స్ వస్తున్నాయి మీ గురించి" అని అడిగిన ప్రశ్నకు "ప్రేమిస్తే రాసుకుపూసుకుని తిరగ్గక్కర్లేదు..ఎక్కువసేపు ప్రేమించిన వాళ్ళ పక్కనే ఉన్నా ప్రాబ్లమ్ అవుతుంది. అందుకే ఇలా దూరంగా మాకు ఇష్టమైన పనులు చేసుకుంటూ ఉంటాం. ఖాళీ దొరికినప్పుడల్లా కలుస్తూ ఉంటాం.
వీడియో కాల్స్ లో రోజూ ఎన్నో విషయాలు మాట్లాడుకుంటాం. గాసిప్స్ అనేవి ఏ రంగంలో ఉన్నవాళ్ళకైనా వస్తూనే ఉంటాయి. అలాంటి గాసిప్స్ ని పట్టించుకోను.. మా అబ్బాయి కూడా అలాంటి గాసిప్స్ వినిపించినా లైట్ తీసుకుంటాడు " అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ యాక్టర్, డైరెక్టర్ కి రిత్విక్ అనే బాబు ఉన్నాడు. "రిత్విక్ యాక్టీవ్ గా ఉంటాడా " అన్న ప్రశ్నకు "చాలా షార్ప్, యాక్టీవ్ గా ఉంటాడు. ఇప్పుడు టీనేజ్ లో 10th క్లాస్ చదువుతున్నాడు కదా ఈ వయసులో పిల్లలంతా ఎలా ఉంటారో అలాగే ఉన్నాడు. వారానికో ఇంటరెస్ట్ గురుంచి నాకు చెప్తూ ఉంటాడు. రమ్య తనని బాగా చూసుకుంటుంది. మేమిద్దరం కూడా రిత్విక్ కి ఎలాంటి కండిషన్స్ పెట్టం. ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాం. చెన్నైలో వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటాడు. ఖాళీ టైంలో ఇక్కడికి వస్తూ ఉంటాడు" అంటూ ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పారు కృష్ణవంశీ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



