'లైగర్' గర్జించాలంటే.. ఇంకా 80 శాతం రికవర్ కావాలి!
on Aug 27, 2022

రౌడీ హీరో విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ పోషించగా, పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన 'లైగర్' మూవీ ఆగస్ట్ 25న విడుదలై నెగటివ్ టాక్‌ను తెచ్చుకుంది. విడుదలకు ముందు వచ్చిన క్రేజ్, హైప్‌తో ఫస్ట్ డే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ. 13.45 కోట్లు (షేర్) రాబట్టింది. కానీ బ్యాడ్ మౌత్ టాక్ ఈ సినిమాకు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తున్నట్లు రెండో రోజు వసూళ్లు తెలియజేస్తున్నాయి. శుక్రవారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 4.06 కోట్ల షేర్ వసూలు చేసింది. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు 70 శాతం పైగా వసూళ్లు పడిపోయాయి.
'లైగర్' వరల్డ్‌వైడ్ ప్రి బిజినెస్ వాల్యూ రూ. 88.40 కోట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఆ వర్గాల ప్రకారం రెండు రోజులకు వచ్చిన షేర్ రూ. 17.51 కోట్లు. అంటే ఇప్పటివరకూ రికవర్ అయ్యింది 20 శాతం లోపే. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే విజయ్ దేవరకొండ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా లైగర్ నిలిచే ప్రమాదం ఉంది.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. రెండో రోజు ఈ సినిమాకు వచ్చింది రూ. 1.54 కోట్ల షేర్. మొదటి రోజు వచ్చింది రూ. 9.57 కోట్లు. దీన్ని బట్టి ఏ స్థాయిలో రెండో రోజు వసూళ్లు పడిపోయాయో ఊహించుకోవచ్చు. ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి వచ్చింది రూ. 11.11 కోట్లు మాత్రమే. ఈ రెండు రాష్ట్రాల్లో 'లైగర్' ప్రి బిజినెస్ వాల్యూ రూ. 62 కోట్లని అంచనా. ఇప్పటికి రికవర్ అయ్యింది 18 శాతం లోపే. ఏదైనా అద్భుతం జరిగి జనం భారీ స్థాయిలో థియేటర్లకు తరలి వస్తే తప్ప.. డిజాస్టర్ నుంచి ఈ సినిమాను కాపాడటం కష్టం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



