రవితేజ 'ఈగిల్'.. డైరెక్టర్ కార్తీక్
on Aug 27, 2022

రవితేజ ఇటీవల 'రామారావు ఆన్ డ్యూటీ'గా మన ముందుకు వచ్చాడు కానీ మెప్పించలేకపోయాడు. ప్రస్తుతం ఆయన త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో 'ధమాకా', సునీల్‌వర్మ డైరెక్షన్‌లో 'రావణాసుర', వంశీ దర్శకత్వంలో 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలు చేస్తున్నాడు. లేటెస్ట్‌గా మరో సినిమాకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సినిమాటోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్న కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో ఆయన పనిచేయనున్నాడు. 'కార్తికేయ 2' బ్లాక్‌బస్టర్ అవడంలో కార్తీక్ సినిమాటోగ్రఫీకి కూడా భాగం ఉంది.
యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందే ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనున్నది. ఎక్కువభాగం విదేశాల్లో షూటింగ్ జరుపుకొనే ఈ సినిమాకు 'ఈగిల్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. కార్తీక్‌కు డైరెక్టర్‌గా ఇదే ఫస్ట్ ఫిల్మ్ కాదు. ఇదివరకే అతను నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన 'సూర్య వర్సెస్ సూర్య' మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. కమర్షియల్‌గా విజయం సాధించకపోయినా ఆ మూవీని బాగా తీశాడనే పేరు తెచ్చుకున్నాడు కార్తీక్.
'ప్రేమ ఇష్క్ కాదల్' సినిమాతో సినిమాటోగ్రాఫర్‌గా పరిచయమైన కార్తీక్, ఆ తర్వాత కార్తికేయ, ప్రేమమ్, ఎక్స్‌ప్రెస్ రాజా, నిన్ను కోరి, అ!, చిత్రలహరి, డిస్కో రాజా లాంటి చిత్రాలకు పనిచేశాడు. ప్రస్తుతం రవితేజ సినిమా 'ధమాకా'కు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నాడు. ఈ టైమ్‌లోనే అతను చెప్పిన స్టోరీ నచ్చి, అతని డైరెక్షన్‌లో నటించేందుకు ఓకే చెప్పాడు రవితేజ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



