ENGLISH | TELUGU  

దర్శకేంద్రుని తీరని కోరికలు ఏమిటో తెలుసా!

on Jan 25, 2023

తెలుగు సినిమాకు కమర్షియల్ హంగులను అద్దిన ఘనత దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుకే చెందుతుంది. 'అడవి రాముడు' నుంచి కమర్షియల్ చిత్రాలను ఇలా తీయవచ్చు అని ఆయన తీసి మరీ నిరూపించారు. దానినే ఇప్పటివరకు అటు ఇటుగా మార్చి మన దర్శకులందరూ వరుస హిట్ల‌ను కొడుతున్నారు. ఇక రాఘవేంద్రరావు తన కెరీర్‌లో 100 చిత్రాలను పూర్తి చేశారు. తన వంద చిత్రాలు పూర్తి అయిన తర్వాత ఆయన పూర్తిగా అన్నమయ్య, శ్రీరామదాసు, పాండురంగడు, నమో వెంకటేశాయ, శిరిడి సాయి వంటి పలు భ‌క్తిర‌స చిత్రాలను తెరకెక్కించారు. ఇక ఈయనకు పాట‌ల‌ను అందంగా తీయడంలోనూ, హీరోయిన్లను అందంగా తెరకెక్కించడంలోనూ, హీరోల క్రేజ్‌ని బట్టి ఎంటర్టైన్మెంట్‌కు మాస్ ఎలిమెంట్స్‌ని మిక్స్ చేసి సినిమాలు తీయడంలోనూ సిద్ధహస్తులనే పేరు ఉంది.    

తన కెరీర్‌లో రాఘవేంద్రరావు దాదాపు అన్ని త‌ర‌హా చిత్రాలకు దర్శకత్వం వహించారు. చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరకు చిత్రాలు చేశారు. మధ్యలో లేడి ఓరియెంటెడ్ చిత్రాలను కూడా టచ్ చేశారు. ఇలా ఈయన సినీ రంగంలో టచ్ చేయని విషయం అంటూ ఏదీ లేదని చెప్పాలి. ఇక ఈయన దర్శక ధీరుడు రాజమౌళికి గురువు. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన 'శాంతినివాసం' సీరియల్ ద్వారానే రాజమౌళి దర్శకునిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత కూడా రాజమౌళి మొదటి సినిమా 'స్టూడెంట్ నెంబర్ 1'కు ఈయన దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ప్రస్తుతం ఈయ‌న ఎక్కువగా దర్శకత్వ పర్యవేక్షణ చేస్తూ స్వయంగా దర్శకత్వం వహించడాన్ని తగ్గించారు.  

ఇక ఇటీవల ఆయన మాట్లాడుతూ తాను చేయలేకపోయిన కొన్ని చిత్రాలు ఉన్నాయని, అలాంటి చిత్రాలను చూస్తున్నప్పుడు ఇలాంటి చిత్రాలు నేను చేయలేకపోయానే అని బాధపడ్డానని తెలిపారు. అందులో గాంధీజీ బయోపిక్ ఒకటి. బ్రిటిష్ వారి పాలన‌పై అహింస అనే ఆయుధంతో పోరాటం చేసి భారత దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి గాంధీ. ఆయన జీవిత కథను హాలీవుడ్‌లో 'గాంధీ' పేరుతో తీసి గొప్ప హిట్టు కొట్టారు. 

ఈ మూవీ కథనం చూసినప్పుడు నేను ఎందుకు ఈ సినిమా చేయలేకపోయానా అని బాధ పడ్డాన‌ని రాఘవేంద్రరావు తెలిపారు. ఇక అథ్లెట్ మిల్కా సింగ్ బయోపిక్‌గా తెర‌కెక్కిన 'భాగ్ మిల్కా భాగ్'  సినిమా చూసిన తర్వాత కూడా ఇలాంటి కథను తను చేయలేకపోయినందుకు ఫీలయ్యాను అని చెప్పారు. ఆ బయోపిక్ చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి జీవితాన్ని ఎంత అద్భుతంగా తెర‌కెక్కించ‌వ‌చ్చు అనేది తెలిసిందని తెలిపారు.

తరువాత మన గ్రామీణ ప్రాంతాలలో ఆడే గూటిబిళ్ళ ఆటని చూసి బ్రిటిష్ వారు కనిపెట్టిన క్రికెట్‌ని మనవాళ్లు ఆడి ఎలా వారిపై గెలిచారు అని చూపించిన 'ల‌గాన్' కూడా తనకి అద్భుతం అనిపించింది అని చెప్పారు. ఇలాంటి కథలను తను తీయలేకపోయానని బాధపడ్డానని రాఘవేంద్రరావు చెప్పుకొచ్చారు. మొత్తానికి తన కెరీర్‌లో బయోపిక్స్ తీయలేకపోవడం రాఘవేంద్రరావుకి తీరని లోటుగా మిగిలిందన్న మాట! 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.