Home

»

Latest News

విజయ్‌ కోసం త్రిషను ఓకే చేసిన రాజు!

Jan 25, 2023 1:44PM

కోలీవుడ్ స్టార్ దళపతి నటించిన వారిసు చిత్రం కోలీవుడ్‌లో సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగు వర్షన్‌లో వారసుడుగా ఇక్క‌డ కూడా విడుద‌లైంది.  కాగా విజయ్ తన తదుపరి చిత్రాన్ని విక్రమ్ ఫేమ్ లోకేష్ కనకరాజుతో చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో విజయ్- లోకేష్ కనకరాజుతో చేసిన మాస్టర్ చిత్రం సూపర్ హిట్ అయింది. కానీ లోకేష్ ను మలుపు తిప్పిన చిత్రం అంటే అది విశ్వ‌ నటుడు కమలహాసన్ నటించిన విక్రమ్ చిత్రమనే చెప్పాలి. ఐదు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్న కమలహాసన్ కు గత కొంతకాలంగా సరైన హిట్స్ లేవు. ఆకలిని మొత్తాన్ని లోకేష్ కనకరాజ్ ఒక్క విక్రంతో బీట్ చేశారు.  ఈ చిత్రం కమలహాసన్ కు ఇండస్ట్రీ హిట్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇక తన తదుపరిచిత్రం విజయ్ కోసం లోకేష్ ఎంతో కష్టపడుతున్నారు.  

కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ కీలక అంశం ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో చ‌క్క‌ర్లు  కొడుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష  అయితే బాగుంటుందని విజయ్ కనకరాజుకు సూచించాడట. అంతేకాదు ఈ పాత్రకు త్రిషనే కావాలని పట్టు బట్టేడట. దాంతో లోకేష్ కనకరాజ్ ఈ చిత్రంలో విజయ్ కి జోడిగా త్రిష‌ను ఎంచుకున్నాడు అనే ప్రచారం సాగుతోంది. వాస్తవానికి లోకేష్ అంటే ఇప్పుడు దేశం మొత్తం పాపులర్. విక్రంతో ఆయన పాన్ ఇండియా స్టార్ట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు.  లోకేష్ ఇంతగా పేరు తెచ్చుకున్నప్పటికీ తన ఇమేజిని తనకున్న క్రేజ్ ను పక్కన పెట్టి విజయ్ చెప్పినా త్రిష‌నే  ఈ చిత్రంలో తీసుకున్నాడని అంటున్నారు. వాస్త‌వానికి లోకేష్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆయ‌న వేరే హీరోయిన్ ని పెట్టుకుంటాన‌ని ప‌ట్టుబ‌డితే విజ‌య్ కాద‌న‌లేరు. కానీ లోకేష్ మాత్రం త్రిష‌నే ఓకే చేశాడ‌ట‌.  

నాలుగు పదుల వయసున్న త్రిష విజయ్‌తో కలిసి నటించి చాలా కాలమైంది. దాంతోనే విజయ్ త్రిష కోసం పట్టుపట్టాడని అంటున్నారు. అయినా విజయ్ అంటే నయా సూప‌ర్ స్టార్ హీరోయిన్ల‌తో పాటు యంగ్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలుగుతున్న ఎవరైనా ఓకే చెప్తారు. ఎంత బిజీగా ఉన్నా విజయ్ తో సినిమా అంటే పచ్చ జెండా ఊపేస్తారు. కానీ కొత్త వారిని కాదని త్రిష వంటి  సీనియర్ హీరోయిన్ ని విజయ్ సిఫార్సు చేశారు  అంటే దీని వెనుక ఏదో మతలబు ఉందని కోలీవుడ్ మీడియా కొడైకుస్తోంది. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com