పహల్ గామ్ దాడి జరగడానికి ముందే అక్కడ్నుంచి వెళ్లిన ప్రముఖ నటి.. షోయబ్ చేసే పనేంటి
on Apr 23, 2025

జమ్మూకాశ్మీర్ లోని 'పహల్ గామ్'(Pahalgam)లో ఉగ్రవాదులు అత్యంత పాశవికంగా జరిపిన దాడిలో, అక్కడి ప్రకృతి అందాలని ఆస్వాదించడానికి వెళ్లిన టూరిస్టులు కొంత మంది చనిపోవడంతో పాటు, మరికొంత మంది గాయపడ్డారు. ఊహించని ఈ సంఘటన ప్రతి ఒక్క భారతీయుడిని ఎంతగానో కలచివేస్తుంది. ప్రముఖ నటి దీపికా కాకర్(Dipika Kakar)ఆమె భర్త షోయబ్(Shoaid Ibrahim)ఇటీవల కాశ్మీర్ వెళ్లారు. అక్కడ అందమైన లొకేషన్స్ లో దిగిన కొన్ని ఫోటోలని ఆదివారం ఇనిస్టాగ్రమ్ లో పంచుకున్నారు. దీంతో నిన్న 'పహల్ గామ్' దాడి జరగడంతో వాళ్లిద్దరు ఎలా ఉన్నారని అభిమానులు సోషల్ మీడియా వేదికగా మెసేజెస్ చేసారు.
దీంతో అభిమానుల మెసేజెస్ కి దీపికా, షోయబ్ లు రిప్లై ఇస్తు 'మేము క్షేమంగానే ఉన్నాం. మంగళవారం ఉదయమే కాశ్మీర్ నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకున్నాం. ఎవరు ఆందోళన పడకండని చెప్పుకొచ్చారు. అయితే షోయబ్ మరో పోస్ట్ లో 'కాశ్మీర్ పర్యటనపై వ్లాగ్ చేసాం. అది త్వరలోనే విడుదల చేస్తామని పోస్ట్ చేసాడు. దీంతో దేశం మొత్తం కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద దాడిపై భాదపడుతుంటే ఇప్పుడు వ్లాగ్ ప్రచారం చేసుకుంటున్నారా అంటు పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
దీపికా కాకర్ హిందీ టెలివిజన్ రంగంలో ఎన్నో హిట్ సీరియల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని సినిమాల్లో క్యామియో రోల్స్ లో కూడా కనిపించిన దీపికా 2015 లో మొదటి భర్త రౌనక్ సాంసన్ కి విడాకులు ఇచ్చి 2018 లో షోయబ్ ని పెళ్లి చేసుకుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



