పహల్ గామ్ లోనే నా పుట్టిన రోజు.. విజయ్ దేవరకొండ సంచలన ట్వీట్
on Apr 23, 2025
.webp)
జమ్మూకాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా 'పహల్ గామ్'(Pahalgam)లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 28 మంది టూరిస్టులు చనిపోవడంతో పాటు ఇరవై మంది దాకా గాయపడ్డారు. దీంతో ఈ సంఘటనపై చిత్ర పరిశమ్రకి చెందిన పలువురు సినీ ప్రముఖులు ఉగ్రవాద దాడిని ఖండిస్తు మృతుల కుటుంబాలకి తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేయడం జరిగింది.
విజయ్ దేవరకొండ(VIjay Deverakonda)కూడా ఈ విషయంపై ట్వీట్ చేస్తు' ఉగ్రవాద దాడి చాలా భాదాకరమైనది. రెండు సంవత్సరాల క్రితం ఒక మూవీ షూటింగ్ కోసం 'పహల్ గామ్' వెళ్లిన నేను, అక్కడి ప్రజల స్వచ్ఛమైన నవ్వుల మధ్య నా పుట్టిన రోజు వేడుకని 'పహల్ గామ్' లోనే జరుపుకున్నాను. స్థానికంగా ఉండే కాశ్మిరీ స్నేహితులు నన్ను బాగా చూసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రాంతంలో జరిగిన సంఘటనతో నా హృదయం పగిలిపోయింది. సైనిక దుస్తుల్లో ఉగ్రవాదులు వచ్చి కాల్పులు జరపడం సిగ్గు చేటు. ఇలాంటి పిరికి వాళ్ళని త్వరలోనే మన సైన్యం అంతమొందిస్తుందని ఆశిస్తున్నా. భారత దేశం ఉగ్రవాదానికీ ఎప్పటికి తల వంచదు. బాధిత కుటుంబాలకి అండగా నిలుస్తామంటు ట్వీట్ చేసాడు.
సినిమాల పరంగా చూసుకుంటే విజయదేవరకొండ ప్రస్తుతం 'కింగ్ డమ్'(Kingdom)అనే మూవీ చేస్తున్నాడు. విజయ్ కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రం నిర్మాణం జరుపుకుంటుండగా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



