మంచు విష్ణుతో దిల్ రాజు భేటీ.. నెక్స్ట్ ఎవరు?
on Aug 4, 2022
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు మంచు విష్ణుని దిల్ రాజు కలిశాడు. బడ్జెట్ కంట్రోల్ విషయమై చర్చలు జరుపుతున్న నిర్మాతలు ప్రస్తుతం షూటింగ్స్ నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 'మా' సభ్యులతో ప్రొడ్యూసర్స్ గిల్డ్ సమావేశమైంది. అయితే ఈ భేటీతో నిర్మాతల సమస్యలతో పాటు, 'మా' గురించి చర్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మంచు విష్ణుతో దిల్ రాజు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
దిల్ రాజుతో భేటీ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు మంచు విష్ణు. 'మా' తరఫున నిర్మాతలను కలుస్తున్న తాను.. సినిమాల్లో 'మా' సభ్యులకి ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని కోరినట్లు చెప్పాడు. అలాగే కొత్త నటీనటులను కూడా 'మా' లో భాగస్వామ్యం చేయాలని కోరినట్లు రాసుకొచ్చాడు. ఈ మేరకు 'మా' సంక్షేమ కమిటీ వినతి పత్రాన్ని దిల్ రాజుకి అందిస్తున్న ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేశాడు విష్ణు.
'మా' సభ్యులకు అవకాశాలు ఇవ్వాలని కోరుతూ విష్ణు మిగతా నిర్మాతలను కూడా కలవనున్నాడు. మరి విష్ణు నెక్స్ట్ ఏ ప్రొడ్యూసర్ ని కలుస్తాడో చూడాలి.
Also Read