ఐటి కార్యాలయానికి దిల్ రాజు..అనుకున్నదే అయ్యింది
on Feb 4, 2025

హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు(Dil Raju)సంక్రాంతికి కానుకగా 'గేమ్ చేంజర్'(Game Changer)'సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunnam)సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.వీటిల్లో 'సంక్రాంతికి వస్తున్నాం' రికార్డు కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతుంది.రీసెంట్ గా 300 కోట్ల క్లబ్ లోకి కూడా చేరింది.
ఇక దిల్ రాజు ఇంటిపై ఇటీవల ఆదాయపుపన్ను అధికారులు రైడింగ్స్ నిర్వహించిన విషయం తెలిసిందే.ఆ సమయంలో వ్యాపార కార్యక్రమాలకి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని దిల్ రాజుకి అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది.ఈ నేపథ్యంలో బ్యాంకు స్టేట్ మెంట్లుతో పాటు,డాక్యుమెంట్లు ఇవ్వడానికే దిల్ రాజు ఐటి కార్యాలయానికి వెళ్లినట్టుగా తెలుస్తుంది.
ఇక ఐటిశాఖ రైడింగ్ జరిగినప్పుడు,పలు రకాల కథనాలు వినిపించినా కూడా,దిల్ రాజు వాటన్నింటిని ఖండిస్తు ఒక ప్రెస్ మీట్ పెట్టి రైడింగ్స్ పై పూర్తి క్లారిటీ ఇవ్వడమే కాకుండా,త్వరలోనే ఐటి ఆఫీస్ కి వెళ్లి వాళ్ళు అడిగినవి సబ్మిట్ చేస్తాడని చెప్పాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



