ఆ పోస్ట్ లు ప్రభాస్ చెయ్యడని చెప్పిన పృథ్వీ..షాక్ లో ఫ్యాన్స్
on Feb 4, 2025
.webp)
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)నుంచి 2023 డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకువచ్చిన మూవీ సలార్ పార్ట్ 1(Salaar).ప్రభాస్ కెరీర్లో వన్ అఫ్ ది బ్లాక్ బ్లాస్టర్ గా కూడా నిలిచిన సలార్ వరల్డ్ వైడ్ గా 700 కోట్ల రూపాయలని రాబట్టి,ప్రభాస్ స్టామినాని మరోసారి చాటి చెప్పింది.ఇక ఈ మూవీలో ప్రభాస్ స్నేహితుడుగా మలయాళ సూపర్ స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్(Prithiraj Sukumaran)చేసిన విషయం తెలిసిందే.వరదరాజ్ మన్నార్ గా అద్భుతమైన నటనని ప్రదర్శించి ప్రేక్షకులని మెప్పించాడు.
రీసెంట్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మాట్లాడుతు ప్రభాస్ ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ చిన్న చిన్న ఆనందాల్ని కోరుకుంటు,చాలా సింపుల్ గా ఉంటాడు.,మొబైల్ పని చెయ్యని చోటుకి వెళదామని అడుగుతుంటాడు.అంత పెద్ద స్టార్ చిన్న చిన్న ఆనందాలు కోరుకోవడం చూసీ ఆశ్చర్యం వేస్తుంది.ఫామ్ హౌస్ లో సంతోషంగా ఉంటాడు.సోషల్ మీడియాపై కూడా ఆసక్తి చూపడు.ప్రభాస్ పేరుతో ఉన్న ఇనిస్టా నుంచి వచ్చే పోస్ట్ లు షేర్ చేసేది కూడా ప్రభాస్ కాదు.ఈ మాట చెప్పి ఫ్యాన్స్ ని నిరాశపరిచినందుకు క్షమించండంటు చెప్పాడు.ఇప్పుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ మాటలు ప్రభాస్ ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేస్తున్నాయి.సలార్ 2 లో కూడా ప్రభాస్, పృథ్వీ లు కలిసి నటించబోతున్న విషయం తెలిసిందే.
.webp)
ఇక ప్రభాస్ ప్రస్తుతం 'ది రాజ్ సాబ్, హనురాఘవపూడి సినిమాల షూటింగ్ లో ఒకేసారి పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు.ఈ రెండు చిత్రాలపై ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.వీటిల్లో 'రాజా సాబ్' ఇప్పటికే మెజారిటీ షూటింగ్ ని జరుపుకోగా,ఏప్రిల్ 10 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో కూడా ప్రభాస్ 'స్పిరిట్ అనే మూవీ చెయ్యబోతున్నాడు.లిస్ట్ లో సలార్ 2 కూడా ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



