సందీప్ రెడ్డి వంగ ఆఫీస్ ప్రస్తుత పరిస్థితి ఇదే
on Feb 4, 2025

అర్జున్ రెడ్డి,కబీర్ సింగ్,యానిమల్ వంటి సూపర్ హిట్స్ తో స్టార్ డైరెక్టర్ గా మారాడు సందీప్ రెడ్డి వంగ(sandeep reddy Vanga)భద్రకాళీ పిక్చర్స్ అనే సొంత ప్రొడక్షన్ హౌస్ ని కూడా స్థాపించి యానిమల్ కి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించాడు.ఇక మెగాస్టార్ 'చిరంజీవి'(Chiranjeevi)కి సందీప్ రెడ్డి హార్డ్ కోర్ ఫ్యాన్ అనే విషయం తెలిసిందే.చాలా ఫంక్షన్స్ లో సందీప్ నే స్వయంగా ఈ విషయాన్నీ వెల్లడి చేసాడు.
రీసెంట్ గా సందీప్ సోషల్ మీడియాలో తన భద్రకాళి పిక్చర్స్ ఆఫీస్ కి సంబంధించిన పిక్ ని షేర్ చేసాడు.సందీప్ షేర్ చేసిన ఆ పిక్ లో 'చిరంజీవి' ఫోటో ఒకటి ఫ్రేమ్ కట్టి ఉంది.చిరు యంగ్ హీరో టైం లో ఉన్న ఆ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మెగా ఫ్యాన్స్ అయితే సందీప్ రెడ్డి గతంలో చెప్పినట్టుగా 'చిరు'కి డై హార్ట్ ఫ్యాన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక చిరంజీవి,సందీప్ రెడ్డి కాంబోలో సినిమా రావాలని మెగా ఫ్యాన్స్ ఎప్పట్నుంచో కోరుకుంటున్నారు.సందీప్ మాత్రం తన అప్ కమింగ్ మూవీ ప్రభాస్ తో చెయ్యబోతున్నాడు.స్పిరిట్ అనే టైటిల్ తో ఆ చిత్రం తెరకెక్కనుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



