God of War: త్రివిక్రమ్ కి హ్యాండిచ్చిన ఎన్టీఆర్!
on Jan 28, 2026
.webp)
'గాడ్ ఆఫ్ వార్' ప్రాజెక్ట్ ఏమైంది?
త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ హ్యాండిచ్చాడా?
'దేవర-2'కే ఎన్టీఆర్ ఓటేశాడా?
కుమారస్వామి కథ ఆధారంగా 'గాడ్ ఆఫ్ వార్'(God of War) అనే భారీ మైథలాజికల్ ఫిల్మ్ ని త్రివిక్రమ్(Trivikram) ప్లాన్ చేశారు. అయితే ఇందులో హీరో ఎవరు అనేది సస్పెన్స్ లా మారింది.
నిజానికి అల్లు అర్జున్(Allu Arjun) 'పుష్ప-2' తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. కానీ, ఆయన అనూహ్యంగా అట్లీ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించారు. దీంతో త్రివిక్రమ్ 'గాడ్ ఆఫ్ వార్'ను ఎన్టీఆర్(Jr NTR)తో చేయాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఎన్టీఆర్ అప్పటికే ప్రశాంత్ నీల్ సినిమా 'డ్రాగన్'తో బిజీగా ఉండటంతో.. ఈ గ్యాప్ లో వెంకటేష్ తో 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47'ను స్టార్ట్ చేశారు త్రివిక్రమ్.
'డ్రాగన్' తర్వాత ఎన్టీఆర్, 'ఆదర్శ కుటుంబం' తర్వాత త్రివిక్రమ్ కలిసి 'గాడ్ ఆఫ్ వార్' చేస్తారని నిన్న మొన్నటి వరకు వినిపించిన న్యూస్. త్వరలో అధికారిక ప్రకటన కూడా వస్తుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేసున్నారు. ఇలాంటి సమయంలో ఊహించని అప్డేట్ వచ్చింది.

Also Read: విజయ్ 'రణబాలి' మూవీ.. ఆ నవలకు కాపీనా..?
మొన్నటివరకు ఎన్టీఆర్ 'దేవర-2' చేస్తారా లేదా? అనే అనుమానాలు ఉన్నాయి. అలాంటిది నిర్మాత సుధాకర్ మిక్కిలినేని మే నెలలో 'దేవర-2' మొదలవుతుందని చెప్పి సర్ ప్రైజ్ చేశారు.
ఇప్పటికే 'డ్రాగన్' షూటింగ్ ఆలస్యమైంది. పైగా అది రెండు పార్టులు అంటున్నారు. ఇక ఇప్పుడు వాటి మధ్యలో 'దేవర-2' కూడా వచ్చి చేరింది. 'డ్రాగన్-1', 'దేవర-2', 'డ్రాగన్-2'.. ఈ మూడు ప్రాజెక్ట్ లు పూర్తి కావాలంటే చాలా సమయం పడుతుంది. ఈ లెక్కన 'గాడ్ ఆఫ్ వార్' ప్రాజెక్ట్ ఇప్పట్లో లేనట్టే. దీంతో త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ హ్యాండిచ్చారా? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.
మరి ఎన్టీఆర్ నిజంగానే మే నుంచి 'దేవర-2' స్టార్ట్ చేస్తారా? ఒకవేళ 'దేవర-2' స్టార్ట్ అయితే 'గాడ్ ఆఫ్ వార్' పరిస్థితి ఏంటి? ఆలస్యంగానైనా ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో 'గాడ్ ఆఫ్ వార్' ఉంటుందా? లేక ఈ ప్రాజెక్ట్ విషయంలో త్రివిక్రమ్ వేరే ఏదైనా నిర్ణయం తీసుకుంటారా? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



