గుణశేఖర్ కి మహేష్ బాబు వార్నింగ్.. ఫ్యాన్స్ ఎవర్ని సపోర్ట్ చేస్తారు
on Jan 28, 2026

-సోషల్ మీడియాలో వైరల్ గా మారిన గుణ శేఖర్
-మహేష్ బాబు వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి
-హిట్ కాంబో నే కదా
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)..క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్(gunasekhar)..ఈ ఇద్దరి కాంబోకి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన స్థానం ఉంది. మహేష్ కి బిగ్గెస్ట్ స్టార్ స్టేటస్ ని కట్టబెట్టిన ఒక్కడు మూవీతో పాటు అర్జున్, సైనికుడు వంటి వినూత్నమైన క్వాలిటీ తో కూడిన చిత్రాలు ఈ ఇద్దరి కాంబోలో వచ్చాయి. పైగా ఈ మూడు చిత్రాలకి భారీ సెట్టింగ్స్ చిత్రాలనే ప్రత్యేకమైన లైనప్ ఉండటంతో పాటు సెట్టింగ్స్ పరంగా నూతన ఒరవడిని కూడా సృష్టించాయి.
ఒక్కడు లో చార్మినార్ సెట్టింగ్, అర్జున్ లో మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్, సైనికుడు లో వేయి స్థంబాల గుడి సెట్స్ సిల్వర్ స్క్రీన్ ని మురిపించడమే కాకుండా ప్రేక్షకులకి కూడా ఆయా ప్లేస్ ల్లో ఉన్న అనుభూతిని కలిగించాయి. రీసెంట్ గా గుణశేఖర్ సైనికుడు లోని వేయి స్థంబాల గుడి సెట్టింగ్ గురించి మహేష్ తనతో చెప్పిన మాటలని వివరించాడు. ఇప్పుడు ఆ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి. అవేంటో చూద్దాం.
గుణశేఖర్ మాట్లాడుతు సెట్స్ భారీగా వేయడం వల్ల అక్కడే ఎక్కువగా షూటింగ్ చేయాలనీ అనిపిస్తుంది. దీంతో మెయిన్ కథ ఆ దిశగా మారి ప్రమాదంలో పడే అవకాశం ఉందని మహేష్ సున్నితంగా హెచ్చరించాడు. మహేష్ చెప్పినట్టే సెట్ వేసాను కదా అని సీన్స్ ని పెంచడంతో పాటు డే లో ఒక సాంగ్, నైట్ లో ఒక సాంగ్ ని చేసాం. దీంతో కథ లిమిట్ అయిపోయింది. అప్పుడు కానీ మహేష్ మాటలతో కాంప్రమైజ్ కాలేకపోయాను.దాంతో ఇక సెట్స్ జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. ఒక రకంగా భారీ సెట్స్ నా కెరీర్ ని దెబ్బకొట్టాయి. చూడాలని ఉంది, ఒక్కడు కి మాత్రం కథ ప్రకారం సెట్స్ చేసానని చెప్పుకొచ్చాడు.
also read: అరుదైన అవార్డుని అందుకున్న మోహన్ బాబు.. ఆయనకే ఎందుకు ఇచ్చారు
గుణశేఖర్ నుంచి ఆ తర్వాత వచ్చిన రుద్రమదేవి, శాకుంతలం చిత్రాలు కథ ప్రకారమే భారీ సెట్స్ తో వచ్చాయి. రుద్రమ దేవి ఒక మోస్తరు విజయాన్ని అందుకున్నా, శాకుంతలం భారీ డిజాస్టర్ ని చవి చూసింది. మహేష్ ప్రస్తుతం వరల్డ్ సినిమా తనవైపు చూసేలా రాజమౌళి(ss Rajamouli)తో కలిసి 'వారణాసి'(Varanasi)ని ముస్తాబు చేస్తున్నాడు. గుణశేఖర్ ఎలాంటి సెట్స్ జోలికి పోకుండా అంతా కొత్త వాళ్ళతో 'యూఫోరియా 'అనే వినూత్నమైన యూత్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



