నవ్వించి చంపేసిన "గ్రాండ్ మస్తీ"
on Sep 25, 2013

సినిమా అనేది అందరిని నవ్వించే విధంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ ఆ నవ్వులు ఎక్కువై ప్రాణాలు కోల్పోయే రేంజులో సినిమా ఉందంటే నమ్ముతారా? కానీ నమ్మక తప్పదు. బాలీవుడ్ లో ఇటీవలే విడుదలైన చిత్రం "గ్రాండ్ మస్తీ". ఈ చిత్ర ట్రైలర్ లోనే చాలా బూతు డైలాగ్స్ ఎక్కువగానే వున్నాయి. అయితే ఈ చిత్రంను ముంబైలోని 22 ఏళ్ల మంగేష్ అనేవ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి కెటివిషన్ అనే మల్టీప్లెక్స్‌లో సినిమాకు వెళ్ళాడు. ఈ చిత్రంలో వచ్చే కామెడీ సన్నివేశాలు అందరూ నవ్వుతున్నారు. అందరితో పాటు మంగేష్ కూడా ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తుండగా, విపరీతంగా నవ్వడంతో చివరకు అతనికి గుండెపోటు వచ్చింది. వెంటనే అతడిని హాస్పిటల్ కి తరలించినప్పటికీ, అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనతో ప్రేక్షకులంతా ఒక్కసారిగా షాకయ్యారు. సినిమా చూస్తే హాయిగా నవ్వుకోవాలని ఉంటుంది కానీ... మరీ ఇలా ప్రాణాలు పోయే విధంగా నవ్వుకోవాలని ఎవరు అనుకోరు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



