వచ్చే ఏడాదంతా దేవీశ్రీదే సందడి!!
on Dec 26, 2018
.jpg)
మ్యూజిక్ మిస్సైల్ దేవిశ్రీప్రసాద్ 19 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు. ఈ ఏడు రిలీజైనవి మూడు సినిమాలే అయినా... అన్నీ కూడా మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. రంగస్థలం, భరత్ అనే నేను, హలో గురూ ప్రేమకోసమే ఈ మూడు సినిమాలు 2018లో రిలీజ్ అయ్యాయి. ఇందులో రంగస్థలం బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలవగా భరత్ అనేనేను బాక్సాఫీ వద్ద హల్ చల్ చేసింది. హలో గురు ప్రేమకోసమే చిత్రం ఫర్వాలేదనిపించిది.
ఇదిలా ఉంటే వచ్చే ఏడాదంతా దేవిశ్రీ ప్రసాద్ సందడే కొనసాగనుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తోన్న `వినయ విధేయ రామ`, వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తోన్న ఎఫ్-2 చిత్రాలు వచ్చే సంక్రాంతికి సందడి చేయనున్నాయి. దీంతో మొదలైన దేవిశ్రీ సందడి ఆ తర్వాత మహేష్ బాబు నటిస్తోన్న మహర్షి, వెంకటేష్, నాగ చైతన్యల మల్టీస్టారర్ `వెంకీమామ`, అలాగే చిరంజీవి, కొరటాల కాంబోలో రానున్న చిత్రంతో పాటు సాయి ధరమ్ తేజ్ `చిత్రలహరి`, నితిన్ భీష్మ ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో సాగనుంది. 2019 లో వవా దేవిశ్రీదే అన్నమాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



