మరోసారి తాతైన మెగాస్టార్!!
on Dec 25, 2018
చిరంజీవి చిన్న కూతురు శ్రీజ క్రిస్మస్ రోజున పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. క్రిస్మస్ పర్వదినాన తమ ఇంట్లోకి మహాలక్ష్మి వచ్చిందంటూ మెగా ఫ్యామిలీ తెగ సంబరపడిపోతున్నారట. పండగ సంతోషాన్ని మరింత పెంచుతూ వచ్చిన పాపాయిని చూసి మరింత మురిసిపోయారట మెగా ఫ్యామిలి. ఈ శుభవార్తను శ్రీజ భర్త కళ్యాన్ దేవ్ ట్విట్టర్ లో కన్ఫర్మ్ చేశారు. . అంతకు ముందే శిరీష్ భరద్వాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి ఒక పాప కూడా జన్మించింది. ఆ తర్వాత భరద్వాజ్ నుండి విడిపోయిన శ్రీజ... రెండేళ్ల కిందట కళ్యాణ్ దేవ్ ని వివాహమాడిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండోసారి శ్రీజ పాపకు జన్మనిచ్చింది.
తమ ఇంట్లోకి మరో కొత్త ప్రాణాన్ని చూసి మెగా కుటుంబం ఇప్పుడు ఆనందంలో తేలిపోతుంది. మరోవైపు తన కూతురును చూసి మురిసిపోతున్నాడు కళ్యాణ్ దేవ్. ఈయన ఈ ఏడాది `విజేత` చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. ప్రజంట్ పులివాసు డైరక్షన్ లో రెండో సినిమా చేస్తున్నాడు. కూతురు పుట్టిన శుభ సందర్భాన తనకు కచ్చితంగా ఇక అంతా శుభమే జరుగుతుందనీ, తన రెండో సక్సెస్ అయి తీరుందని భావిస్తున్నాడట మెగా అల్లుడు.