కమెడియన్ రాజు శ్రీవాత్సవ్ కన్నుమూత!
on Sep 21, 2022

ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాత్సవ్(58) కన్నుమూశారు. గత నెలలో గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన 40 రోజుల పాటు మృత్యువుతో పోరాడి.. ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు.
ఆగస్టు 10న జిమ్ లో వర్కౌట్ చేస్తూ రాజు శ్రీవాత్సవ్ గుండెపోటుతో కుప్పకూలడంతో ఆయనను కుటుంబసభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. 40 రోజుల పాటు వైద్యుల బృందం శ్రమించినప్పటికీ ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. ఈరోజు ఆయన మృతి చెందారు. శ్రీవాత్సవ్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
'ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్'తో స్టాండప్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజు శ్రీవాత్సవ్ పలు హిందీ సినిమాల్లో నటించి అలరించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



