రవిబాబు, పూర్ణల 'అవును'కి పదేళ్ళు
on Sep 21, 2022

పూర్ణ ప్రధాన పాత్రలో రవిబాబు దర్శకత్వంలో రూపొందిన సినిమా 'అవును'. ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్ పై రవిబాబు నిర్మించిన ఈ మూవీ సెప్టెంబర్ 21, 2012న విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని విజయం సాధించింది. ఈ చిత్రం విడుదలై నేటితో పదేళ్లు పూర్తయింది.
'మనసారా'(2010), 'నువ్విలా'(2011) వంటి రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన హారర్ థ్రిల్లర్ ఫిల్మ్ 'అవును'. ఇందులో మోహిని పాత్రలో పూర్ణ నటించగా, ఆమె భర్తగా హర్షవర్ధన్ రాణే కనిపించాడు. కెప్టెన్ రాజు(రవిబాబు) ఆత్మ మోహిని భర్తలో ప్రవేశించి ఆమెను శారీరకంగా అనుభవించాలని చూస్తుంది. దీంతో ఆమె సొంత భర్తపైనే హత్యాయత్నం చేస్తుంది. అసలు కెప్టెన్ రాజు ఎవరు? అతని ఆత్మ మోహినిని ఎందుకు వెంటాడుతుంది? అతని బారి నుంచి మోహిని తప్పించుకోగలిగిందా? వంటి ఆసక్తికరమైన కథా కథనాలతో తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టి విజయం సాధించింది. 'అవును' విజయంతో రవిబాబు 'అవును-2'(2015) కూడా రూపొందించాడు. కానీ అది 'అవును' స్థాయిలో అలరించలేకపోయింది.
'అవును' చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించాడు. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. జీవా, గాయత్రీ భార్గవి, సుధ, చలపతి రావు, రాజేశ్వరి తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



