వైజాగ్ లో అలీ కొడుకు బర్త్ డే వేడుకలు
on Jun 9, 2022

అలీ, జుబేదా అలీ కలిసి వాళ్ళ కొడుకు అబ్దుల్ పుట్టినరోజు వేడుకలను వైజాగ్ లో ఘనంగా చేసుకున్నారు. "అందరూ బాగుండాలి అందులో నేనుండాలి" మూవీ ప్రొడ్యూసర్ ఐన మోహన్ వాళ్ళింటికి అలీ ఫామిలీ మొత్తం వెళ్ళింది. ఐతే అసలు విషయం ఏంటంటే అలీ మిత్రుడైన చిలుకూరి సత్యనారాయణ వాళ్ళ అబ్బాయి కోసం ఒక హాస్పిటల్ ని ఏర్పాటు చేయడంతో దాని ఓపెనింగ్ కి అలీ ఫామిలీని పిలిచేసరికి అందరూ ఈ సందర్భంగా వైజాగ్ వెళ్లారు. ఇక అలీ అబ్బాయి పుట్టిన రోజు అనే విషయం తెలుసుకుని అక్కడ స్పెషల్ గా ఏర్పాట్లు చేశారన్నమాట .
ఇక అలా అక్కడ వ్యూ వీడియొ , కేక్ కటింగ్ , చిట్ చాట్ ముగించుకుంది అందరికి సెండ్ ఆఫ్ చెప్పేసి రిటర్న్ బయల్దేరారు. ఎయిర్ పోర్ట్ కి వెళ్లే దారిలో కాసేపు పిల్లలంతా బీచ్ లో ఎంజాయ్ చేశారు. ఇక అక్కడ కొంత మంది వీళ్ళను గుర్తుపట్టి మాట్లాడారు. వెళ్లిన చోట్ల చాలా మంది అలీ అభిమానులు సెల్ఫీలు తీసుకున్నారు. ఈ వీడియొ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక నెటిజన్స్ కి కూడా అలీ అబ్బాయి అబ్దుల్ కి బర్త్ డే విషెస్ ని కామెంట్స్ లో చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



