నా జీవితాన్ని నయనతార ప్రేమకు అంకితమిస్తున్నాను!
on Jun 9, 2022

నయనతార, విఘ్నేశ్ శివన్ ఈరోజు మహాబలిపురంలోని షెరటాన్ పార్క్‌లో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు. ఈ సందర్భంగా తన కాబోయే భార్య నయనతారకు ఓ ప్రత్యేకమైన పోస్ట్‌ను అంకితం చేశాడు విఘ్నేశ్. ఆ ఇద్దరూ 2015 నుంచి డేటింగ్‌లో ఉన్నారు. ఈరోజు జూన్ 9. ఇది నయన్‌ది. ఇప్పటివరకు నా లైఫ్‌లో తారసపడిన అందరు చక్కని మనుషులకు, దేవునికి, ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ప్రతి మంచి ఆత్మ, ప్రతి మంచి క్షణం, ప్రతి మంచి కాకతాళీయం, ప్రతి మంచి ఆశీర్వాదం, షూటింగ్‌లో ప్రతి రోజూ, ప్రతి ప్రార్థన జీవితాన్ని ఇలా అందంగా మార్చింది! మంచి వ్యక్తీకరణలకు, ప్రార్థనలకు నేను రుణపడి ఉంటాను. ఇప్పుడు, ఇదంతా నా జీవితం అయిన నయనతార ప్రేమకు అంకితమిస్తున్నాను అని అతను రాసుకొచ్చాడు.
"నా తంగమే! నువ్వు కొన్ని గంటల్లో నడవ మీదికి నడుచుకుంటూ రావడం చూడబోతున్నందుకు ఎగ్జయిట్ అవుతున్నాను. అందరికీ మంచి జరగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. మన ప్రియమైన కుటుంబం, మంచి స్నేహితుల సమక్షంలో అధికారికంగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని ఎదురుచూస్తున్నా." అని కూడా అతను రాశాడు.
ఆ స్టార్ కపుల్ పెళ్లికి ఒక రోజు ముందు, సోషల్ మీడియాలో వారి శుభలేఖ వైరల్ అయ్యింది. "సర్వశక్తిమంతుడైన భగవంతుడు, మా పెద్దలు, ఈ విశ్వం ఆశీర్వాదంతో, కురియన్ కొడియట్టు, శ్రీమతి ఓమన కురియన్ దంపతుల కుమార్తె నయనతార, శ్రీ శివకొలుందు, శ్రీమతి మీనాకుమారి దంపతుల కుమారుడు విఘ్నేష్ శివన్ వివాహ వేడుకకు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం" అని ఆ ఇన్విటేషన్‌లో ఉంది.
చెన్నైలో జరిగిన ఓ కాన్ఫరెన్స్‌లో, నయనతారతో తన వివాహ ప్రణాళికలను విఘ్నేశ్ వెల్లడించాడు. తొలుత తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించాడు. అయితే భద్రతా సమస్యల కారణంగా పెళ్లి వేదికను మార్చాలని నిర్ణయించుకున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



