జైలుకు జానీ మాస్టర్!!
on Mar 28, 2019
టాలీవుడ్ లో ప్రతిభావంతులైన కొరియోగ్రాఫర్స్ లో జానీ మాస్టర్ ఒకరు. చిరంజీవి, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలకు ఈయన కొరియోగ్రాఫర్ గా పని చేసారు. డిఫరెంట్ స్టెప్స్ లో తనకంటూ సపరేట్ స్టైల్ ఏర్పరుచుకున్నాడు. కాకుంటే ఈ మాస్టర్ కు కొంచెం దూకుడెక్కువే అని చెప్పాలి. ప్రజంట్ జానీ మాస్టర్ జైలు లో స్టెప్స్ వేస్తున్నాడు. గతంలో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన కేసులో జైలుకు వెళ్లాడు. మేడ్చల్ ఏయస్ జే కోర్టు న్యాయమూర్తి జయప్రసాద్ ఆరు నెలల జైలు శిక్ష తో పాటు 1000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
గతంలో జానీ తన అనుచరులతో కలిసి 2014లో మరో డ్రాన్స్ గ్రూప్ తో గొడవపడ్డారట. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మేడ్చల్ పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేసి కోర్టుకు అప్పగించారు. ఇంత కాలానికి దానికి సంబంధించిన వాదోపదాలతో విన్న న్యాయమూర్తి బుధవారం జానీ మాస్టర్ తో పాటు తన ఐదుగురు అనుచరులకు జైలు శిక్ష విధించారు.