Home

»

Latest News

సమంత 'శాకుంతలం' నుంచి కీలక అప్డేట్

Feb 19, 2022 5:07PM

సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న పాన్ ఇండియా మూవీ 'శాకుంతలం'. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే కొంతకాలంగా ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ రాకపోవడంతో సమంత ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. అయితే తాజాగా ఈ మూవీ నుంచి కీలక అప్డేట్ వచ్చింది.

'శాకుంతలం' ఫస్ట్ లుక్ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఈ మూవీ ఫస్ట్ లుక్ ని ఫిబ్రవరి 21 న ఉదయం 9:30 కి విడుదల చేస్తున్నట్లు తాజాగా మూవీ టీమ్ ప్రకటించింది. దీంతో ఈ మూవీలో సమంత లుక్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. 'శాకుంతలం' సినిమాతో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను వెండితెరపై ఆవిష్కృతం చేయబోతున్నాడు డైరెక్టర్ గుణశేఖర్. ఇందులో శకుంతలగా సమంత, దుష్యంతుడిగా మలయాళీ నటుడు దేవ్‌ మోహన్‌ నటిస్తున్నారు. మరి ఫస్ట్ లుక్ లో ఇద్దరి లుక్స్ రివీల్ చేస్తారో లేక సమంత లుక్ మాత్రమే రివీల్ చేస్తారో చూడాలి.

దిల్‌రాజు సమర్పణలో గుణటీమ్‌ వర్క్స్‌ బ్యానర్ పై నీలిమా గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఈ మూవీతో వెండితెరకు పరిచయమవుతుండటం విశేషం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com