అభిమానికి అండగా మెగాస్టార్
on Aug 16, 2022

కష్టాల్లో ఉన్న అభిమానులను ఆదుకోవడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. క్యాన్సర్ బారిన పడిన అభిమానిని మెరుగైన వైద్యం కోసం మంచి ఆసుపత్రిలో చేర్పించి, స్వయంగా పరామర్శించి గొప్ప మనసుని చాటుకున్నారు.
కృష్ణా జిల్లాకి చెందిన దొండపాటి చక్రధర్ మెగాస్టార్ కి వీరాభిమాని. చిరంజీవి పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకున్న చక్రధర్ కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారు. అంతేకాదు సోమవారం సాయంత్రం ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన చిరంజీవి.. అన్ని విధాలా అండగా ఉంటానని చక్రధర్ కి, అతని కుటుంబానికి భరోసా ఇచ్చారు. అలాగే వైద్యులతో మాట్లాడి చక్రధర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న మెగాస్టార్.. మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
అభిమాని ఆరోగ్యం పట్ల చిరంజీవి చూపిస్తున్న శ్రద్ధపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



