చిరు డబుల్ గేమ్!
on Jun 20, 2015
.jpg)
అటు వినాయక్ - ఇటు పూరి జగన్నాథ్ - చిరు 150వ సినిమాకి దర్శకుడు ఎవరన్నది ఇంకా తేలడం లేదు. ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించినట్టుగా చిరు సినిమాకి పూరినే దర్శకుడు. కాకపోతే.. పూరికి చిరు ఏ క్షణంలో అయినా హ్యాండివొచ్చన్నది టాలీవుడ్ టాక్. ఎందుకంటే వినాయక్ కూడా ఇప్పుడు చిరు కోసం కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారట.
ఆటోజానీ ఫస్టాఫ్ బాగానే ఉన్నా.. సెకండాఫ్ సంగతి ఇంకా తేల్చకపోవడం, జ్యోతిలక్ష్మి ఫ్లాపు.. చిరుని నిరుత్సాహపరిచాయి. అందుకే ఈ ప్రాజెక్టు నుంచి పూరిని తప్పించడానికి ఆయన రంగం సిద్ధంచేశారు. పూరిని తప్పించేలోగా వినాయక్‌తో కథ ఓకే చేయించాలన్నది చిరు ప్రయత్నం. చిరు 150వ సినిమా బాధ్యతల్ని భుజాన వేసుకోవడానికి సిద్ధంగా లేకపోయినా... అన్నయ్య అడిగాడని వినాయక్ కూడా హడావుడిగా రంగంలోకి దిగారు. ఆయన ఆస్థాన రచయితల్ని హుటాహుటిన తన ఆఫీసుకు పిలిపించుకొని... `చిరు కోసం ఏమైనా కథ ఉందా..?` అంటూ ఆరాలు తీస్తున్నారు.
చిరంజీవి 150వ సినిమా కోసం ముందుగా అనుకొన్నది వినాయక్ పేరే. అప్పట్లో సిద్ధం చేసిన కథల్ని ఇప్పుడు మళ్లీ బయటకు తీస్తున్నట్టు భోగట్టా. చిరు కి కూడా ఈ డబుల్ గేమ్ బాగుంది. ఎవరు మంచి కథతో వస్తే. వాళ్లతో ప్రొసీడ్ అయిపోదామని చూస్తున్నాడు చిరు. మరి ఆ ఒక్కరు ఎవరన్నది చిరు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



