'శ్రీమంతుడు'కి కాసుల వర్షం
on Jun 20, 2015
.jpg)
సూపర్ స్టారా మజాకా.ఎంత పెద్ద హీరోకైనా వరుస రెండు డిజాస్టర్లు వస్తే మాత్రం, నెక్స్ట్ సినిమా బిజినెస్ అవ్వడానికి ట్రైలర్స్ అనీ, అవనీ ఇవనీ చెప్పి ఆపసోపాలు పడాల్సి వస్తోంది. కానీ సూపర్ స్టార్ విషయంలో మాత్రం అంత రివర్స్ లో జరుగుతోంది. వరుసగా రెండు డిజాస్టర్లు ఇచ్చిన ఆయన క్రేజ్ పెరిగిందే తప్పా తగ్గలేదు. లేటెస్ట్ గా ఆయన నటించిన 'శ్రీమంతుడు' సినిమా ఒక్క టీజర్ తోనె భారీ బిజినెస్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
శ్రీమంతుడు సినిమా శాటిలైట్ రైట్స్ మొదలుకొని, థియేట్రికల్ రైట్స్ వరకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగినట్టు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ ముందే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ వరకు 58కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. దీంతో నిర్మాతలు సినిమా రిలీజ్ ముందే లాభాల బాటపట్టినట్లు సమాచారం. ఇక్కడ ఇంకోక విశేషమేమిటంటే ఈ సినిమా మహేష్ బాబు కూడా ఓ నిర్మాతే. తొలి వెంచర్ తోనే ఆయనకు లాభాల పంట పండబోతుందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



