అటువంటి క్యారెక్టర్లు చచ్చినా చేయను! : ఛార్మి
on May 16, 2019
'జ్యోతిలక్ష్మి' తర్వాత ఛార్మి పేరు మూడు సినిమాల టైటిల్ కార్డ్స్ లో పడింది. అయితే... హీరోయిన్ గా కాదు, నిర్మాతగా! కెరీర్ క్రేజ్ లో ఉన్నప్పుడు, అవకాశాలు వస్తున్నప్పుడు... ఉన్నట్టుండి హీరోయిన్ గా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. 13 ఏళ్ల వయసులో కథానాయికగా తెలుగు తెరపై అడుగుపెట్టిన పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మి, అన్ని భాషలలో కలిపి సుమారు 55 సినిమాల్లో నటించారు. తర్వాత నటనను పక్కనపెట్టి నిర్మాణంపై దృష్టి పెట్టారు. పూరి జగన్నాథ్ తో కలిసి ఆయన దర్శకత్వంలో వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు. పూరి కనెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. తెరవెనుక కాకుండా తెరపై ఎప్పుడు కనిపిస్తారు? అని ఛార్మిని అడిగితే...
ఇకపై తెరపై కనిపించిన అని స్పష్టం చేశారు. "ఎన్నాళ్ళని కథానాయికగా ఇండస్ట్రీని పట్టుకుని వేలాడడం అంటారు? నాకు ఇష్టం లేదు' అన్నట్టు మాట్లాడారు. ఇప్పటికీ ఎవరో ఒకరు తమ సినిమాల్లో నటించమని చార్మిని సంప్రదిస్తున్నారట. అయితే తను అను అవకాశాలు అన్నిటిని సున్నితంగా తిరస్కరిస్తున్నానని ఛార్మి చెబుతున్నారు. 'ఒకప్పటి కథానాయకులు ఇప్పుడు హీరోలకు అక్కగా, వదినగా చేస్తున్నారు కదా?' అని ప్రశ్నిస్తే... "అటువంటి క్యారెక్టర్ లు నేను చచ్చినా చేయను ఎవరు చేయమన్నా చేయను" అని ఛార్మి చెప్పారు. సో... ఇకపై ఛార్మి నిర్మాతగా మాత్రమే ప్రేక్షకులు ముందుకు వస్తారు అన్నమాట.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
