గురువుగారికి నచ్చిన హీరోయిన్
on Jul 18, 2014
తెలుగులో ఇద్దరమ్మాయిల్లో ఒకరిగా చేసినా కేథరిన్ పైసా సినిమాలో కూడా కనిపించదని గుర్తుండే వుంటుంది. తెలుగులో ఇప్పటికి ముచ్చటగా మూడే సినిమాల్లో నటించిన కేథరిన్ ఇప్పుడు 151వ సినిమాను దక్కించుకుంది. అందేంటి 3 నుంచి 151వ సంఖ్యకు ఇలా గబుక్కున ఎలా వెళ్లిందంటారా... అయితే చదివేయండి..
ఛమ్మక్ చల్లో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కెథరిన్ కత్తిలాంటి కళ్లతో బాగానే మాయ చేసింది. రెండవ సినిమా పూరీ దర్శకత్వంలో బన్నీతో, మూడవ సినిమా కృష్ణ వంశీ డైరెక్షన్ లో నానీతో చేసేసింది. మరి ఈ భామలో ఏం టాలెంట్ గ్రహించారో గాని, గురువు గారు దాసరి నారాయణరావు కూడా ఈమెను తన సినిమాకు ఎంపిక చేశారు. ఆయన స్వీయ దర్శకత్వంలో వస్తున్న నూటా యాభై ఒకటవ సినిమాలో నెంబర్ వన్ ఛాన్స్ కొట్టెసింది కేథరిన్. అలా మూడు నుంచి 151 నెంబర్ కి లంకె కుదిరింది.