దాసరి బయోగ్రఫీ విడుదలయ్యుంటే... అందరి బండారాలు బయట పడేవి
on Jun 1, 2017
దాసరి నారాయణ రావు మృతి ఒక శకానికి ముగింపుగా అందరూ అభివర్ణిస్తున్నారు. ఇండస్ట్రీ కి పెద్ద దిక్కుగా ఉంటూ చిన్న నిర్మాతలకు ఎప్పుడూ తానున్నానంటూ భరోసా ఇచ్చే దాసరి మరణం నిజంగా పూడ్చలేని పెద్ద లోటు. ఇక అసలు విషయానికి వస్తే, చాలా మంది సెలెబ్రిటీల మాదిరిగా, దాసరి కూడా తన బయోగ్రఫీ ప్లాన్ చేసారు. ఒక ఈవెంట్లో మాట్లాడుతూ, బయోగ్రఫీ రాస్తున్నానని. ఇది అన్ని బయోగ్రఫీల లాగా తన వ్యక్తిగత జీవితం గురించి మాత్రమే కాదని, ఇండస్ట్రీ లో పలువురి బండారాలు బయట పెట్టేలా ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేసారు.
దాదాపు మూడున్నర సంవత్సరాల నుండి బయోగ్రఫీ రాస్తున్నానని, అది కంప్లీట్ అవ్వడానికి మరో సంవత్సరంన్నర పడుతుందని వివరించారు. ఈ స్టేట్మెంట్ దాసరి ఎవరి గురించయితే చేసారో, వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టించి ఉంటది. ఆ బుక్ గనక విడుదలయ్యుంటే, పరిస్థితి ఎలా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. ఎవరికీ భయపడని దాసరి, తన బయోగ్రఫీలో నిప్పులాంటి నిజాలు కర్కశంగా చెబుదాం అని అనుకున్నారు. ఇంకొన్నాళ్ళు అయన ఆరోగ్యంగా ఉండుంటే విడుదలకి నోచుకునేదేమో... కానీ కొందరి అదృష్టం కొద్దీ అది జరగలేదు.