ENGLISH | TELUGU  

దాసరి మరణంపై ఎవరెమన్నారంటే..

on May 31, 2017

ప్రముఖ తెలుగుచలన చిత్ర దర్శకుడు  దాసరి నారాయణరావు మృతి పట్ల రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన చలన చిత్ర రంగానికి చేసిన సేవలు మారువలేనివని విచారం వ్యక్తం చేశారు. దాసరి నారాయణ రావు కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

నా అత్యంత ఆప్తుడు మిత్రుడు దాసరి ఇండియా లోనే గొప్ప దర్శకుడు మంచి మనిషి అటువంటి మనిషిని కోల్పోవడం ఇండస్ట్రీకి తీరని లోటు....ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి

- రజనీకాంత్

నాకు నటుడిగా గుర్తింపునిచ్చిన దాసరి గారి మరణాన్ని జీర్ణించుకోవడం కష్టంగానే ఉన్నా.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ సాయినాధుని సాక్షిగా కోరుకొంటున్నాను.                        
-మోహన్ బాబు

తెలుగు సినిమా గమనానికి సరికొత్త దారి చూపిన దాసరి గారి మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటు. ఆయన మరణానికి చింతిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నాను.   
-నందమూరి బాలకృష్ణ 
                     
దర్శక ద్రోణాచార్యుడు మా దాసరి గారు మా మధ్య లేరనే వార్త నా మనసుని కలచివేసింది. ఆయన మరణం తెలుగు సినిమాకి తీరని లోటు. ఆయన చూపిన బాటలో మా దర్శకులం అందరం నడిచి.. ఆయన ఆశయాన్ని నెరవేరుస్తాం.
-బోయపాటి శీను 

మా దర్శకుల పెద్ద, దర్శకుల స్థాయి పెంచిన ప్రతిభాశాలి దాసరి గారి మరణం మా దర్శకులకు మాత్రమే కాక తెలుగు చిత్రసీమకు కూడా పెద్ద దెబ్బ. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటున్నాను.
-క్రిష్ జాగర్లమూడి 

ఒక దర్శకుడిగా నాకు దార్శనికుడు, తెలుగు చిత్రసీమకు మార్గ దర్శకుడు దర్శకరత్న దాసరి గారి మరణం మాకు తీరని లోటు.
-దర్శకుడు శ్రీవాస్                        

ఒక దర్శకుడిగా, ఇండస్ట్రీ పెద్దగా దాసరి గారి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు!
-గోపీచంద్

తెలుగు సినిమాకి, సినిమా దర్శకుల కులానికి గురువు, తెలుగు సినిమా చరిత్రని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన శ్రీ దాసరి నారాయణరావు గారు మృతి యావత్తు తెలుగు ప్రేక్షకులకి తీరని లోటు ... అయన లేని తెలుగు సినిమాని ఊహించలేము.. దాసరిగారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను
-హీరో నాగ శౌర్య

దర్శకరత్న దాసరిగారి మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటు, నిర్మాత క్షేమం కోరే ఆయనలాంటి వ్యక్తి మరణం జీర్ణించుకోవడం కష్టం.
-సాయి కొర్రపాటి

ఇండస్ట్రీ ఎదుగుదల కోసం అనునిత్యం ఆరాటపడిన వ్యక్తి దాసరి గారు, అలాంటి మనిషి మన మధ్య లేకపోవడం బాధాకరం.
-నారా రోహిత్                        

మా దర్శకులందరికీ పెద్ద దిక్కులాంటి దాసరి గారు శారీరికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన ఆశయాలు మాత్రం ఎప్పటికీ మమ్మల్ని నడిపిస్తూనే ఉంటాయి.
-దర్శకుడు సంపత్ నంది                        

దాసరి గారు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన సాధించిన ఘనత, తెలుగు సినిమాకు తీసుకొచ్చిన గౌరవం చిరస్మరణీయం.
-పి.వి.పి                        

ఆయన దర్శకదిగ్గజం మాత్రమే కాదు, తెలుగు సినిమాకు మణిహారం, ఆయన లాంటి గొప్ప వ్యక్తి ఇక లేరనే వార్త మింగుడుపడడం లేదు.
-చందు మొండేటి     

మాలాంటి యువ నటులందరికీ స్ఫూర్తి అయిన దాసరి గారి మరణం మాకు తీరని లోటు.
-విజయ్ దేవరకొండ

తెలుగు సినిమా రొమ్ము విరుచుకొని నిలబడేలా చేసిన దార్శనికుడు దాసరి గారు మరణించడం మా దర్శకులందరికీ తీరని లోటు.
-దర్శకుడు ఎన్. శంకర్

స్టార్‌డమ్ నటులకు మాత్రమే సొంతం కాదని ప్రూవ్ చేసి, దర్శకుడి పేరు పోస్టర్ పైకి తెచ్చిన మహనీయుడు దాసరి, ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు.
-దర్శకుడు తేజ             

తెలుగువాడి సత్తాను ప్రపంచానికి పరిచయం చేసి.. దర్శకుడి స్థాయిని పెంచిన దర్శకరత్న దాసరి మరణం నన్ను ఎంతో బాధిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటున్నాను.
-నటుడు శర్వానంద్   

తెలుగు చిత్రసీమకు పెద్ద దిక్కులాంటి దాసరి నారాయణరావు గారి మరణం జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటున్నాను.
-నటుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్

నన్ను నటుడిగా ఆదరించి ఆశీర్వదించిన అతి తక్కువ మంది వ్యక్తుల్లో దాసరి గారు ప్రధములు, అటువంటి గొప్ప మనిషి మరణం ఇండస్గ్రీకి తీరని లోటు.
-నటుడు శ్రీవిష్ణు    

ఇండస్ట్రీకి మాత్రమే కాదు మా కుటుంబానికి కూడా పెద్ద దిక్కు లాంటి దాసరి గారి మరణం మాకు తీరని లోటు. 
-మంచు విష్ణు, మంచు మనోజ్

నేను తీసిన మొదటి సినిమాకి మొదటి అభినందన లభించింది దాసరి గారి నుంచే, అలాంటి వ్యక్తి మరణం నన్ను చాలా బాధించింది.
-దర్శకుడు క్రాంతి మాధవ్

నాలాంటి ఎంతోమంది నిర్మాతలకు  స్ఫూర్తి ఆయన, మా "పెళ్ళిచూపులు" చిత్రానికి అనుక్షణం వెన్నంటి ఉన్న దాసరి గారు మరణించడాన్ని తట్టుకోలేకున్నాం.
-రాజ్ కందుకూరి

ఒక నటుడిగా, ఒక దర్శకుడిగా, ఒక వ్యక్తిగా నాపై దాసరి గారి ప్రభావం చాలా ఉంటుంది. అలాంటి మనిషి మరణ వార్త నన్ను ఎంతగానో బాధించింది.
-నటుడు, దర్శకుడు రవిబాబు   

నా సినిమాల్లో తెలుగుదనం ఎక్కువగా ఉండాలనే ఆలోచన దాసరి గారి వల్లనే వచ్చింది. ఆయన సినిమాలు నాపై చూపిన ప్రభావం అలాంటిది. అలాంటి వ్యక్తి మరణం నన్ను కలచివేసింది.
-దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి                        

చిన్నాపెద్దా అనే తేడా లేకుండా టాలెంట్ ను ఎంకరేజ్ చేసిన మహోన్నత మనస్తత్వం కలిగిన వ్యక్తి దాసరి నారాయణరావు గారు. ఆయన మరణానికి చింతిస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.
-దర్శకుడు సుధీర్ వర్మ

తెలుగు సినిమా ఒక గొప్ప వ్యక్తిని, శక్తిని కోల్పోయింది. ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చిన దాసరి నారాయణరావు మన అందరి హృదయాల్లో ఎప్పుడు బ్రతికే ఉంటారు - 
-వి.వి.వినాయక్

దాసరి గారి మరణంతో  తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. ఇండస్ట్రీ లో ఎన్నోసమస్యలను పరిష్కరించి ఇండస్ట్రీ కి పెద్ద దిక్కుగ నిలిచినా దాసరి గారి మరణం మమ్మల్ని ఎంతో బాధకి గురిచేసింది. అయన ఆత్మ కు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం  

నిర్మాతలు:జె భగవాన్ -జె పుల్లారావు

 

దర్శకుడు అనే పదానికి ఎంతో విలువను తీసుకొచ్చిన మహొన్నత వ్యక్తి దాసరి నారాయణరావు. తెలుగు సినీ పరిశ్రమకు పెద్దదిక్కుగా వున్న ఆయన ఈ రోజు మన మధ్యలో లేరు అంటే నమ్మశక్యంగా లేదు. ఆయన లేని లోటు ఎప్పటికీ అలాగే వుంటుంది. 
-దర్శకుడు సుకుమార్ 


నిర్మాత మేలుకోరే చాలా తక్కువ మంది దర్శకుల్లో దాసరి గారు ఒకరు. ఆయన నుంచి ఇండస్ట్రీ చాలా నేర్చుకొంది, ఇంకా నేర్చుకోవలసింది ఉండగానే ఆయన మరణించడం బాధాకరం.
-నిర్మాత అశ్వినిదత్


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.