ఇప్పుడెందుకండీ బ్రహ్మోత్సవం ఎడిటింగ్...?
on May 21, 2016
సినిమా రిలీజైపోయి, జరగాల్సిన ఘోరం జరిగిపోయిన తర్వాతే శ్రీకాంత్ అడ్డాల అండ్ కో కు మెలకువ వచ్చింది. బ్రహ్మోత్సవం సినిమా సీరియల్ లా ఉందని, ల్యాగ్ చాలా ఎక్కువగా ఉందని విమర్శకులు, ఫ్యాన్స్ కూడా సినిమాను ఏకి పారేస్తున్నారు. దీంతో నష్టనివారణా చర్యలు చేపట్టారు మూవీ టీం. ఎలాగైనా డిజాస్టర్ ను తప్పించాలని ఫాస్ట్ గా ఎడిటింగ్ టేబుల్ దగ్గర ల్యాగ్ ఉన్న పార్ట్ అంతా తీసేశారట. ఫస్ట్ హాఫ్ లో ఒక పాట కూడా లేచిపోయిందని చెబుతున్నారు. ఇంత భారీగా ఖర్చు పెట్టి తీసిన సినిమాను ప్రింట్ ఫైనల్ అయ్యే ముందు ఒక్కసారి కూడా రష్ చూడలేదో, లేక చూసినా విపరీతంగా నచ్చేసిందో కానీ, దాన్ని అలాగే సీరియల్ లా రిలీజ్ చేసేశారు.
విచిత్రమేంటంటే, మొత్తం సినిమా నాలుగు గంటలు డ్యూరేషన్ వచ్చిందంటూ ఫిల్మ్ నగర్ జనాలు చెప్పుకుంటున్నారు. అది చూసి దిమ్మతిరిగిన మహేష్, ట్రిమ్ చేయడం మొదలుపెట్టి, చివరు 2 గంటల 46 నిముషాల దగ్గర ఆపాడని, ఆ తర్వాత కూడా లెంగ్త్ ఎక్కువే అనిపించి మరో 10 నిముషాలు లేపితే, ఇప్పుడున్న సినిమాలా మారిందని టాక్. అయితే ఇప్పటికే సినిమా చూసిన జనాలు ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఏ సీన్ ఎందుకు ఎక్కడ వస్తుందో, ఎవరు ఎవరికి ఏమవుతారో తెలియని పరిస్థితి. ఇప్పుడు పడిన మరిన్ని కత్తిరింపులతో సినిమా మరింత కన్ఫ్యూజన్లో పడిపోతుందని మూవీ చూసొచ్చిన జనాల ఫీలింగ్..చేతులు కాలాక ఏం చేస్తే మాత్రం వాతలు రాకుండా ఆగవుగా..!