మళయాళ జనతాగ్యారేజ్ లో ఎన్టీఆర్ లేడు..!
on May 21, 2016
నిన్న యంగ్ టైగర్ బర్త్ డే అని జనతాగ్యారేజ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ లుక్ లో కేవలం ఎన్టీఆర్ ను మాత్రమే మనం చూశాం. ఈరోజు మరో లుక్ ను రిలీజ్ చేశారు మూవీ టీం. అది కూడా మళయాళ పోస్టర్. అక్కడి సూపర్ స్టార్ మోహన్ లాల్ పుట్టిన రోజు ఈ రోజే కావడంతో, ఆ సందర్భంగా మళయాళ లుక్ ను రిలీజ్ చేసింది. ఇటు పక్కన బ్రహ్మజీ, అటు పక్కన తమిళ నటుడు రెహ్మాన్ లతో మోహన్ లాల్ నడిచొస్తున్న ఈ స్టిల్, మోహన్ లాల్ ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చేలా ఉంది. అయితే ఎంత కేరళ పోస్టర్ అయితే మాత్రం, మూవీ హీరో ఎన్టీఆర్ స్టిల్ లేకుండా రిలీజ్ చేశారేంటి అంటూ ఫీలవుతున్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్. మూవీ కి హీరో ఎన్టీఆర్ అయినా కేరళలో సినిమాకు క్రేజ్ రావాలంటే, మోహన్ లాల్ మెయిన్ అంటూ మూవీ టీం కూడా ఆన్సరిస్తున్నారు. సినిమాలో మోహన్ లాల్ కు అనుచరుడిగా బ్రహ్మాజీ, తమ్ముడిగా రెహ్మాన్ చేస్తున్నారని మూవీ వర్గాలంటున్నాయి. రెహ్మాన్ కొడుకుగా జూనియర్ కనిపిస్తాడట. ఇప్పుడు రిలీజ్ చేసిన లుక్ ఫ్లాష్ బ్యాక్ లో మోహన్ లాల్ కు సంబంధించిందని సమాచారం.