నిజ జీవితంలో ఒక పిల్లాడి తల్లిని పెళ్లి చేసుకున్న బ్రహ్మాజీ!
on Aug 17, 2022
బ్రహ్మాజీ.. టాలీవుడ్ లో ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న వ్యక్తి. డిఫరెంట్ క్యారెక్టర్స్ తో డిఫరెంట్ రోల్స్ లో నటిస్తూ ఉంటాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా రాణించి సత్తా చాటారు బ్రహ్మాజీ. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి ఒక ఇంటరెస్టింగ్ విషయం బయటపెట్టారు. ముఖ్యంగా తన భార్యా పిల్లల గురించిన నిజాన్ని బ్రహ్మాజీ ఆడియెన్స్ తో షేర్ చేసుకున్నారు. తాను చెన్నైలో ఉన్నప్పుడు పరిచయమైన ఒక బెంగాలీ అమ్మాయిని వివాహం చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు.
తమకు పెళ్లి జరిగే టైంకి ఆమె తాను హస్బెండ్ నుంచి డివోర్స్ తీసుకుందని, ఐతే అప్పటికే ఆమెకో బాబు ఉన్నాడని చెప్పారు. అందుకే మళ్ళీ పిల్లలు ఎందుకు అనిపించిందని, అందుకే ఇద్దరం ఆలోచించుకుని ఇక పిల్లలు వద్దనుకున్నామని వెల్లడించారు బ్రహ్మాజీ. అలా తన భార్య కొడుకునే పెంచి పెద్ద చేసి పెళ్లి చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇక అతన్ని 'ఓ పిట్ట కథ' పేరుతో వచ్చిన మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేసారు బ్రహ్మాజీ.
లైఫ్ విషయం వచ్చేసరికి నెటిజన్స్ బ్రహ్మాజీని తెగ మెచ్చుకుంటున్నారు. తన సినిమా జీవితం గురించి మాట్లాడుతూ తనకు సినిమా కష్టాలేవీ లేవన్నారు. తన జీవితం ఇండస్ట్రీలో సాఫీగా సాగిపోయిందన్నారు. తూర్పుగోదావరిలో పుట్టి, పశ్చిమగోదావరిలో పెరిగినట్లు చెప్పారు. తన తండ్రి తహసీల్దార్ అనే విషయాన్ని చెప్పారు. చదువు పూర్తైన తర్వాత చెన్నైకి వెళ్లి నటనలో శిక్షణ తీసుకున్నానని తెలిపారు బ్రహ్మాజీ. ట్రైనింగ్ టైంలోనే రవితేజ, కృష్ణవంశీ, రాజా రవీంద్ర వంటి వారు పరిచయమయ్యారని వెల్లడించారు. తన కెరీర్ స్టార్టింగ్ లో బాగా సాగిందని, ఆ తర్వాత పదేళ్ల పాటు వచ్చిన పాత్రలు మాత్రం తనకు సంతోషాన్ని ఇవ్వలేదని చెప్పారు. ఇప్పుడు మళ్లీ మంచి పాత్రలు వస్తున్నాయన్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోల మూవీస్ లో మాత్రం బ్రహ్మాజీకి తప్పకుండా ఓ క్యారెక్టర్ ఉంటుందని చెప్పుకొచ్చారు.
Also Read