మెగాస్టార్ తో పోటీకి దిగుతున్న అఖిల్ అక్కినేని!
on Jan 31, 2023

ఇటీవల 'వాల్తేరు వీరయ్య' చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దీంతో మెగాస్టార్ మెగా కమ్ బ్యాక్ ఇచ్చాడంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన తదుపరి చిత్రం 'భోళా శంకర్'పై అంచనాలు పెరిగిపోయాయి. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ చిత్రానికి పోటీగా అక్కినేని అఖిల్ చిత్రం విడుదలవుతుండటం ఆసక్తికరంగా మారింది.
అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఏజెంట్'. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతోన్న ఈ ఫిల్మ్ ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ చిత్రానికి కొత్త విడుదల తేదీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాని ఏప్రిల్ 14న విడుదల చేయనున్నారని, త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఇప్పటికే ఏప్రిల్ 14 డేట్ ని 'భోళా శంకర్' లాక్ చేసుకుంది. మరి ఆ సినిమా ఆలస్యమవుతుందన్న ఉద్దేశంతో 'ఏజెంట్'ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారా లేక పోటీకి సిద్ధపడే బరిలోకి దింపుతున్నారా అనేది తెలియాల్సి ఉంది.
పైగా ఈ రెండు చిత్రాలు ఒకే బ్యానర్ లో ఏకే ఎంటర్టైన్మెంట్స్ లో రూపొందుతుండటం విశేషం. ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ సైతం తాము నిర్మించిన రెండు బడా సినిమాలు 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి'లను ఒకేసారి విడుదల చేసి ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఏకే ఎంటర్టైన్మెంట్స్ సైతం అదే బాటలో పయనిస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



