'బింబిసార' థియేట్రికల్ బిజినెస్ ఇంత తక్కువా!
on Aug 3, 2022
నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన 'బింబిసార' మూవీ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. మల్లిడి వసిష్ఠ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాకి రూ.40 కోట్ల బడ్జెట్ అయినట్లు ప్రచారం జరిగింది. ఇంత బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ రిస్క్ చేస్తున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. అయితే కళ్యాణ్ రామ్ కి కి సొంతం వీఎఫ్ఎక్స్ కంపెనీ ఉండటంతో పాటు, ప్రొడక్షన్ సమయంలో తీసుకున్న స్పెషల్ కేర్ కారణంగా ఈ ప్రాజెక్ట్ ని రూ.35 కోట్ల లోపు బడ్జెట్ తో పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీ ఇప్పటికే సేఫ్ జోన్ లోకి వెళ్లిందని సమాచారం. ఈ సినిమాకి థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ.15 కోట్లు.. డిజిటల్, శాటిలైట్, ఆడియో రైట్స్ రూపంలో రూ.25 కోట్లు వచ్చాయట. అంటే ఈ సినిమా ఇప్పటికే రైట్స్ రూపంలో 40 కోట్లతో సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయిందన్నమాట.
'బింబిసార' థియేట్రికల్ రైట్స్ ని రూ.15 కోట్లకు తీసుకున్న దిల్ రాజు.. కొన్ని ఏరియాల హక్కులను తన దగ్గర ఉంచుకొని, మిగతా ఏరియా హక్కులను ఇతరులకు అమ్మేసినట్లు సమాచారం. ఏరియాల వారీగా బిజినెస్ వాల్యూ నైజాంలో రూ.5 కోట్లు, సీడెడ్ రూ.2 కోట్లు, ఆంధ్రాలో రూ.6.50 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రైట్స్ విలువ రూ.13.50 కాగా.. కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా రూ.1.10 కోట్లు, ఓవర్సీస్ లో రూ.1 కోటి కలిపి వరల్డ్ వైడ్ గా రూ.15.60 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిందట.
పాజిటివ్ టాక్ వస్తే 16 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని 'బింబిసార' ఈజీగా దాటేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదట్లో 'బింబిసార' గురించి పెద్దగా ఎవరికీ తెలియనప్పటికీ.. టీజర్, ట్రైలర్ విడుదలయ్యాక ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఏ సినిమాకి రానంత బజ్ ఈ సినిమాకి వచ్చింది. ప్రస్తుతం థియేటర్స్ లో సినిమాలకు ఆదరణ అంతంతగా ఉన్న ఇలాంటి సమయంలో.. 'బింబిసార' అడ్వాన్స్ బుకింగ్స్ కి మంచి రెస్పాన్సే వస్తోంది. మరి చెప్పుకోదగ్గ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read