వీర సింహారెడ్డి ఓటీటీ డీల్ ఓకే అయింది!
on Jan 13, 2023
.webp)
నందమూరి నటసింహ బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి 12వ తారీఖున గ్రాండ్గా విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి మిక్స్ డ్ టాక్ వచ్చింది. రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి. సినిమాలో యాక్షన్ ఎలివేషన్ బాగానే ఉన్నా ఎమోషన్స్ మాత్రం మిస్ అయ్యాయని, గోపీచంద్ మలినేని తనకు వచ్చిన అద్భుత అవకాశాన్ని సరిగా సద్వినియోగం చేసుకోలేదు. ఆయన అనుకున్న స్థాయిలో పూర్తిగా సినిమాని ప్రజెంట్ చేయలేకపోయారు అంటున్నారు.
కాగా ఈ సినిమాకు సంబంధించిన థియేటికల్ బిజినెస్ బాగా లాభాలు అర్జించేలా సాగాయి. మైత్రి మూవీస్ వారికి ఈ చిత్రం శాటిలైట్ మంచి లాభాలను తీసుకొని వచ్చింది. ఓటిటీ మొదట అమెజాన్ ప్రైమ్ అన్నారు. కానీ అది తప్పని తెలిసింది. తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ సినిమా ఓటిటి హక్కులను సొంతం చేసుకుంది. ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. ఓటిటిలో సినిమా విడుదలైన 50 రోజులు తర్వాత స్ట్రీమింగ్ చేయాలని ఈమధ్య అగ్రిమెంట్లు జరిగాయి. ఏ సినిమా అయినా సరే ఈ రోజుల్లో 50 రోజుల తర్వాత మాత్రమే ఓటీటీలో ప్రసారం చేయాలి నిర్మాతలు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఇది. అదే నిబంధన ప్రకారం వీరసింహారెడ్డి కూడా విడుదలైన 50 రోజుల తర్వాత ఓటీడీలో స్ట్రీమింగ్ కానుంది సమాచారం.
ఈ చిత్రం మంచి కలెక్షన్లు సాధిస్తుంటే మాత్రం ఈ డేట్ ఇంకా వాయిదా పడే అవకాశం ఉంది. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయగా, శృతిహాసన్ హీరోయిన్గా నటించగా మరో పాత్రలో హనీరోజ్ కనిపించింది. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఒక పవర్ఫుల్ పాత్రలో ఆమె కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. మరి వీరసింహారెడ్డి థియేటర్ల వద్ద ఎలాంటి కలెక్షన్లను లాంగ్ లాంగ్ రన్ లో సాధిస్తుంది అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



