పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్!
on Oct 16, 2024
.webp)
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, ప్రజా సేవకే తన సమయాన్ని కేటాయిస్తున్నారు. అయినప్పటికీ పవన్ సినిమాల కోసం ఎదురుచూసేవారు ఎందరో ఉన్నారు. ఆయన సినిమాలను థియేటర్లలో సెలెబ్రేట్ చేసుకోవడానికి అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. పవన్ కూడా తన నిర్మాతలకు నష్టం జరగకుండా ఇప్పటికే కమిటై ఉన్న సినిమాలను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల 'హరి హర వీరమల్లు' షూట్ తిరిగి ప్రారంభమైంది. ఇక ఇప్పుడు 'ఓజీ' వంతు వచ్చింది. (OG Movie)
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో 'హరి హర వీరమల్లు', 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలు ఉన్నాయి. అయితే వీటిలో అందరి దృష్టి ప్రధానంగా 'ఓజీ'పై ఉంది. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా.. పవర్ స్టార్ అసలుసిసలైన బాక్సాఫీస్ స్టామినాను తెలిపేలా సంచలనాలు సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. అందుకే 'హరి హర వీరమల్లు', 'ఉస్తాద్ భగత్ సింగ్' కంటే కూడా 'ఓజీ' కోసం ఫ్యాన్స్ ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే 'ఓజీ' నుంచి ఇప్పుడొక అదిరిపోయే అప్డేట్ వచ్చింది. #TheyCallHimOG
తాజాగా 'ఓజీ' షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. త్వరలోనే పవర్ స్టార్ కూడా షూటింగ్ లో పాల్గొనే అవకాశముంది. ఇప్పటికే 'ఓజీ' షూటింగ్ చాలా వరకు పూర్తయింది. పవన్ డేట్స్ ని బట్టి మిగతా షూటింగ్ ని వీలైనంత త్వరగా పూర్తిచేసి, వచ్చే ఏడాది సెప్టెంబర్ లోపు ఈ చిత్రాన్ని విడుదల చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



