డేంజర్ లో ప్రముఖ హీరోయిన్ భర్త? లైట్ వేసింది ఎవరు!
on Oct 16, 2024
.webp)
ఇండియన్ సినీ ప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు ప్రియాంక చోప్రా(priayanka chopra)2003 లో హిందీ చిత్ర రంగ ప్రవేశం చేసిన ప్రియాంక మాజీ ప్రపంచ సుందరి కూడాను. ఆమె చేసే ప్రతి సినిమాలో తనదైన ముద్ర చూపించడం ప్రియాంక నటనకి ఉన్న స్టైల్.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ తుఫాన్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి పలకరించింది.
కొన్ని సంవత్సరాల తర్వాత క్రితం అమెరికన్ పాప్ సింగర్ అయినటువంటి నిక్ జోనాస్(nick jonas)ని వివాహం చేసుకుంది. నిక్ తాజాగా తన సోదరులతో కలిసి ప్రేగ్ లో ఒక కాన్సర్ట్ నిర్వహిస్తున్నాడు. ఆడియెన్స్ కూడా భారీ ఎత్తున వచ్చారు. అందులో నుంచి ఒక గుర్తు తెలియని వ్యక్తి నిక్ పై లేజర్ లైట్ వేసాడు. దీంతో కంగారు పడిన నిక్ షో ని మధ్యలోనే ఆపేసి వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. దీంతో నిక్ ఏదైనా డేంజర్ లో ఉన్నాడేమో అనే చర్చలు చాలా మందిలో మొదలయ్యాయి. అభిమానులు మాత్రం అలాంటిదేమి లేదని భద్రత సిబ్బంది లేజర్ లైట్ వేసిన వ్యక్తి ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు.

సెక్యూరిటీ వాళ్ళు అన్ని చెక్ చేసే షో లోపలకి పంపిస్తారు.అలాంటిది లేజర్ ఎలా వచ్చిందనే విషయం అంతు చిక్కని విధంగా ఉందని నిక్ సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు.ప్రియాంక,నిక్ కి 2018 లో వివాహం జరిగింది. అప్పట్నుంచి లాస్ ఏంజిల్స్ నే సెటిల్ అయిన ప్రియాంక పలు ఇంగ్లీష్ సినిమాల్లో చేస్తూ ఉంది. ఇద్దరకీ ఒక బాబు కూడా ఉన్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



