తెలంగాణాకి బంపర్ ఆఫర్ ప్రకటించిన రజనీకాంత్..ఆంధ్రాకి మాత్రం నో
on Oct 16, 2024
.webp)
సూపర్ స్టార్ రజనీకాంత్(rajinikanth)విజయదశమి కానుకగా ఈ నెల పదకొండున వెట్టయ్యన్(vettaiyan)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీలో నిజాయితీ గల పోలీసు ఆఫీసర్ గా రజనీ ప్రదర్శించిన నటన ప్రతి ఒక్కర్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఒక హత్య జరిగిన విషయంలో మన కంటితో చూసే వన్నీ నిజాలు ఉండవని, ప్రతి విషయంలోనూ ప్రాపర్ ఇన్విస్టిగేషన్ జరగాలనే మంచి సందేశాన్ని కూడా వెట్టయ్యన్ ఇచ్చింది.
ఇప్పుడు ఈ మూవీ తెలంగాణప్రేక్షకులకి ఒక బంపర్ ఆఫర్ ని ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్స్ ని తగ్గించి మల్టిప్లెక్స్ లో రెండు వందల రూపాయలు, హైదరాబాద్ తో పాటు పలు ప్రధాన నగరాల్లోని సింగిల్ థియేటర్స్ కి నూట యాభై రూపాయలు, జిల్లా థియేటర్స్ లో నూట పది రూపాయలుగా నిర్దారించింది. దీంతో ఫ్యామిలీ తో పాటు వెట్టయ్యన్ కి వెళ్లే వాళ్ళకి మంచి ఉపయోగం అని చెప్పవచ్చు.

రజనీకాంత్ పాటు అమితాబ్ బచ్చన్(amitabh bachchan)రానా, ఫాహద్ ఫాజిల్, దుహారా విజయన్ వంటి వారు ప్రధాన పాత్రల్లో చేయగా జై భీం వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన టి జె జ్ఞానవేల్(t j jnanavel)దర్శకత్వాన్ని వహించాడు.లైకా ఎంటర్ టైనేమెంట్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మించగా ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది.టికెట్ ధరలు తగ్గించడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



