రూమర్స్‌కు చెక్.. 'భోళా శంకర్' అప్డేట్ వచ్చేసింది!
on Oct 27, 2021
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తమిళ హిట్ మూవీ 'వేదాళం'కు రీమేక్ గా ఈ మూవీ రూపొందుతోంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అగష్టు 22న ఈ మూవీ అధికారిక ప్రకటన వచ్చింది. అప్పటినుంచి ఈ మూవీ నుంచి ఎటువంటి అప్డేట్ లేదు. అయితే తాజాగా ఈ మూవీ ఓపెనింగ్ కి సంబంధించిన అప్డేట్ వచ్చింది.
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి చేయబోయే 'భోళా శంకర్' సినిమా ఆలస్యమయ్యే అవకాశముందని ఇటీవల వార్తలొచ్చాయి. ఆ రూమర్స్ కి చెక్ పెడుతూ మూవీ టీమ్ తాజాగా అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా నవంబర్ 11న ఉదయం 7:45 నిమిషాలకు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. అలాగే, నవంబర్ 15 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుందని చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ తెలియజేసింది.
'భోళా శంకర్' సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా నడిచే సినిమా. ఇందులో చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తుంది. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.
Also Read