Home

»

Latest News

"మీ ఇష్టంరా అంతా మీ ఇష్టం".. రెండో పెళ్లి ప్ర‌చారంపై మంచు మ‌నోజ్ రెస్పాన్స్‌!

Oct 27, 2021 11:59AM

 

ఈమ‌ధ్య జ‌రిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో అన్న‌య్య మంచు విష్ణు గెలుపుకు త‌న వంతు కృషి చేశాడు త‌మ్ముడు మంచు మ‌నోజ్‌. అంతే కాదు, ఆ రోజు విష్ణు ప్యాన‌ల్‌, ప్ర‌కాశ్‌రాజ్ ప్యాన‌ల్ స‌భ్యుల మ‌ధ్య గొడ‌వ‌లు తీవ్ర స్థాయికి వెళ్ల‌కుండా సామ‌ర‌స్య వాతావ‌ర‌ణం నెల‌కొన‌డానికి కూడా ప్ర‌య‌త్నించాడు. ఆరోజు మ‌నోజ్ అక్క‌డ లేక‌పోతే ఏమై వుండేదో అని ప్ర‌కాశ్‌రాజ్ ప్యాన‌ల్ స‌భ్యులు కొంత‌మంది బ‌హిరంగంగా కామెంట్ చేయ‌డం మ‌నం చూశాం. 

కాగా ఇప్పుడు మ‌నోజ్ సెకండ్ మ్యారేజ్ గురించిన రూమ‌ర్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అత‌ను రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వ‌చ్చిన ఒక న్యూస్‌ను సోష‌ల్ మీడియా హ్యాండిల్స్‌లో ప‌లువురు షేర్ చేస్తున్నారు. దీనిపై మ‌నోజ్ రెస్పాండ్ అయ్యాడు. ఆ న్యూస్‌ను త‌న‌దైన శైలిలో ఖండిస్తూ, త‌న‌ను కూడా ఆ పెళ్లికి ఆహ్వానించ‌మ‌ని వ్యంగ్యంగా తెలిపాడు.

ఆన్‌లైన్‌లో ప్ర‌చారంలోకి వ‌చ్చిన న్యూస్ ఆర్టిక‌ల్ ప్ర‌కారం మ‌నోజ్ ఒక ఫారిన్ అమ్మాయితో ల‌వ్‌లో ప‌డ్డాడంట‌. అయితే తండ్రి మోహ‌న్‌బాబుకు వారి పెళ్లి ఇష్టం లేదంట‌. త‌మ బంధువుల్లోనే ఒక‌మ్మాయిని మ‌నోజ్ చేసుకుంటే బాగుంటుంద‌ని ఆయ‌న కోరుకుంటున్నాడంట‌. త్వ‌ర‌లోనే త‌ను ప్రేమించిన అమ్మాయిని మ‌నోజ్ వివాహం చేసుకుంటాడ‌ని ఆ న్యూస్‌లో రాసుకొచ్చారు.

ఆ ప్ర‌చారాన్ని ఖండించిన మ‌నోజ్‌, "ప్లీజ్ న‌న్ను కూడా ఆహ్వానించండి.. ఆ పెళ్లెక్క‌డ‌, ఎవ‌రా బుజ్జి పిల్ల తెల్ల పిల్ల‌?!  మీ ఇష్టంరా అంతా మీ ఇష్టం" అని త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్‌లో రాసుకొచ్చాడు. దాంతో పాటు బ్ర‌హ్మానందం షాక‌వుతున్న‌ట్లు పోజిచ్చిన ఫొటోను షేర్ చేశాడు.

మ‌నోజ్ 2015లో హైద‌రాబాద్‌కు చెందిన ప్ర‌ణ‌తిరెడ్డి అనే యువ‌తిని పెళ్లాడాడు. అయితే పొర‌పొచ్చాల‌తో ఇద్ద‌రూ 2019లో విడిపోయారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com