'పుష్పక విమానం' అప్డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
on Oct 27, 2021
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన లేటెస్ట్ సినిమా 'పుష్పక విమానం'. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సమర్పణలో కింగ్ ఆఫ్ ది హిల్ ప్రొడక్షన్, టాంగా ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దామోదర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 12న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ టీమ్ ప్రమోషన్స్ షురూ చేసింది.
విజయ్ దేవరకొండ, కింగ్ ఆఫ్ ది హిల్ సోషల్ మీడియా వేదికగా 'పుష్పక విమానం' విడుదలకు సంబంధించిన అప్డేట్ ను పంచుకున్నారు. ఈ సినిమాను బడా సంస్థలు డిస్ట్రిబ్యూట్ చేయనున్నాయి. ఆంధ్ర, సీడెడ్ లో సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా.. నైజాం లో గ్లోబల్ సినిమాస్ వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక ఓవర్సీస్ లో ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిల్మ్స్ వారు రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.
'పుష్పక విమానం' సినిమాలో గీత సైని, శాన్వి మేఘన హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సునీల్, నరేష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. త్వరలోనే ట్రైలర్ విడుదల చేయనున్నారు.
Also Read