'భీమ్లా నాయక్' విడుదలపై వీడని సస్పెన్స్.. మళ్ళీ వాయిదా తప్పదా?
on Jan 31, 2022
.webp)
కరోనా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడిన సినిమాల విడుదలపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. మార్చి 11 న 'రాధేశ్యామ్', మార్చి 25 న 'ఆర్ఆర్ఆర్', ఏప్రిల్ 28 న 'ఎఫ్-3', ఏప్రిల్ 29 న 'ఆచార్య', మే 12 న 'సర్కారు వారి పాట' విడుదల కానున్నాయి. అయితే 'భీమ్లా నాయక్' విడుదల తేదీపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. పరిస్థితిని బట్టి ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1 న సినిమా విడుదల చేస్తామంటూ మేకర్స్ సస్పెన్స్ కంటిన్యూ చేస్తున్నారు.
నిజానికి భీమ్లా నాయక్ సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కావాల్సి ఉంది. అయితే జనవరి 7 న 'ఆర్ఆర్ఆర్' విడుదల ఉండటంతో.. ఆ మూవీ మేకర్స్ రిక్వెస్ట్ తో భీమ్లా నాయక్ ఫిబ్రవరికి వాయిదా పడింది. ఆ తర్వాత కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్ తో ఆర్ఆర్ఆర్ కూడా వాయిదా పడింది. మార్చి 18 లేదా ఏప్రిల్ 28 న మూవీని విడుదల చేస్తామని ప్రకటించిన ఆర్ఆర్ఆర్ మేకర్స్ తాజాగా మార్చి 25 న విడుదల చేస్తామంటూ కొత్త తేదీని ప్రకటించారు. దీంతో ఏప్రిల్ 1 న విడుదల కావాల్సిన ఆచార్య ఏప్రిల్ 29 కి వెళ్ళిపోయింది.
.webp)
ఫిబ్రవరి 25 న విడుదల కావాల్సిన భీమ్లా నాయక్ ఏప్రిల్ 1 కి వాయిదా పడే అవకాశముందని ఇటీవల న్యూస్ వినిపించింది. అందుకు తగ్గట్లే ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1 న సినిమాని విడుదల చేస్తామంటూ భీమ్లా నాయక్ మేకర్స్ తాజాగా ప్రకటించారు. అయితే ఫిబ్రవరి 25 నే భీమ్లా నాయక్ ని విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఏప్రిల్ 1 కి వారం ముందు మార్చి 25 న ఆర్ఆర్ఆర్ వస్తుండటంతో.. గతంలో మాదిరి మళ్ళీ ప్రొడ్యూసర్స్ రిక్వెస్ట్ తో భీమ్లా నాయక్ వాయిదా పడుతుందేమోనన్న ఆందోళన వారిలో నెలకొంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



