'బంగార్రాజు' టీజర్.. నవ మన్మథుడు వచ్చాడు
on Nov 23, 2021
అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'బంగార్రాజు'. ఈ సినిమాలో అక్కినేని యువ హీరో నాగ చైతన్య, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కీలక పాత్రలలో నటిస్తున్నారు. కృతి శెట్టి పోషిస్తున్న నాగ లక్ష్మి పాత్ర లుక్ ఇటీవల విడుదలై ఆకట్టుకుంది. ఇక నిన్న(నవంబర్ 22న) చైతన్య లుక్ విడుదల కాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. నేడు(నవంబర్ 23) చైతన్య పుట్టినరోజు సందర్భంగా మూవీ టీజర్ ను విడుదల చేశారు. చిన బంగార్రాజుగా చైతన్య ఆకట్టుకున్నాడు.
'బంగార్రాజు' ఫస్ట్ లుక్ అంటూ చైతన్య పోస్టర్ విడుదల చేసినప్పుడే చైతన్య బంగార్రాజు యంగర్ వర్షన్ రోల్ ప్లే చేస్తున్నాడని అర్థమైంది. ఇక తాజాగా రిలీజ్ చేసిన టీజర్ తో క్లారిటీ వచ్చేసింది. టీజర్ ని సోషల్ మీడియాలో షేర్ చేసిన నాగార్జున.. 'చిన బంగార్రాజు' వచ్చేసాడని పోస్ట్ చేశాడు. టీజర్ లో చైతన్య స్టైల్, బాడీ ల్యాంగ్వేజ్ ఆకట్టుకునేలా ఉన్నాయి. 'నవ మన్మథుడు వచ్చాడు' అంటూ వచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నాగార్జున- కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో 2016లో వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆ సినిమాకి ప్రీక్వెల్ గా 'బంగార్రాజు' వస్తుంది. గతంలో అక్కినేని హీరోలు నటించిన 'మనం' ఘన విజయాన్ని సాధించింది. ఇప్పుడు అక్కినేని హీరోలు నాగార్జున, చైతన్య మరోసారి బంగార్రాజుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బంగార్రాజుగా నాగార్జున, చిన బంగార్రాజుగా చైతన్య ఏ స్థాయిలో అలరిస్తారో చూడాలి.
Also Read