ENGLISH | TELUGU  

ఇండియన్ ఐడల్ స్టేజి పై మెరిసిన బాలయ్య

on Jun 3, 2022

తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ రియాలిటీ షో ఫిబ్రవరి 25 నుంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ  మంచి రేటింగ్స్ సంపాదించుకుంది. ఈ షోకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్, హీరోయిన్ నిత్యా మీనన్, ఫేమస్ సింగర్ కార్తీక్ జడ్జెస్ గా ఉన్నారు. శ్రీ రామచంద్ర స్టైలిష్ హోస్ట్ గా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇక ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే ఈ షోకి నందమూరి బాలకృష్ణ వచ్చి సింగర్స్ తో కలిసి సందడి చేసి మంచి స్టెప్స్ వేసి స్టేజిని మరింత ఎనర్జిటిక్ గా మార్చేశారు.

బాలయ్య మార్క్ డైలాగ్ " క్యాజువల్ గా రాలేదు..కాంపిటీషన్ కి వచ్చాను " అంటూ తనదైన శైలిలో పంచ్ డైలాగ్స్ వేసి అందరిలో జోష్ నింపారు. ఈ స్పెషల్ ఎపిసోడ్ జూన్ 10 న ఆహాలో స్ట్రీమ్ కాబోతుందని ఇప్పటికే నిర్వాహకులు ప్రకటించేశారు. ఈ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అంటూ బాలయ్య ఫాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక జూన్ 3 న ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి లెజెండరీ సింగర్ ఉష ఉత్తుప్ గెస్ట్ గా విచ్చేసారు. ఈ ఎపిసోడ్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ శ్రీనివాస్, జయంత్, వాగ్దేవి, ప్రణతి, లాలస, వైష్ణవి వీళ్లల్లో ఎవరు తెలుగు ఇండియన్ ఐడల్ అవుతారో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.