ఇక ఫ్రీగా ఓటీటీలో 'కేజీఎఫ్ 2'
on Jun 3, 2022

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీని ఈరోజు నుంచి ఎలాంటి ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేకుండానే అమెజాన్ ప్రైమ్ లో ఫ్రీగా చూడొచ్చు. ఈ మూవీకి థియేటర్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 2022లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. అంతే కాదు, ఇండస్ట్రీ హిట్స్‌లో 'దంగల్', 'బాహుబలి 2' తర్వాత ప్లేస్‌లో నిలిచింది. రిలీజ్ ఐన అన్ని భాషల్లోనూ ఈ సినిమా మంచి ఆదరణ పొందడం విశేషం. ఇక ఓటీటీలో ఇంతదాకా పే పర్ వ్యూ పద్ధతిన అందుబాటులో ఉన్న ఈ మూవీని మరింత మంది చూసే వీలు కల్పించింది అమెజాన్ ప్రైమ్ వీడియో.
పే పర్ వ్యూ అనే కాన్సెప్ట్ ని తీసేసి అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు ఈ రోజు నుంచి ఫ్రీ గా ఈ మూవీని చూసే అవకాశం కల్పించింది. యష్ పర్ఫార్మెన్స్, యాక్షన్ ఈ మూవీకి హైలైట్. 'కేజీఎఫ్' ఎంత బిగ్ సక్సెసో దాన్ని మించి సీక్వెల్ పెద్ద సక్సెస్ అయ్యింది. అమెజాన్ ప్రైమ్ ఈ చిత్రాన్ని ఓటిటిలో రిలీజ్ చేసేందుకుగాను రూ. 320 కోట్లు పెట్టి కొనుక్కుంది. నిజం చెప్పాలంటే ప్రశాంత్ నీల్ ఒక గ్రాండ్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నట్లే. 2022 అతనికి బాగా కలిసివచ్చిందనే చెప్పొచ్చు. ఇక సంజయ్ దత్, రవీనా టాండన్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచారు. రవి బస్రూర్ సంగీతం, భువన్ గౌడ సినిమాటోగ్రఫీ సినిమాకు ఎస్సెట్‌గా నిలిచాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



