బ్యాన్ చైనా... మెగాబ్రదర్ పిలుపు
on Jun 3, 2020

చైనా వస్తువులను బ్యాన్ చేద్దామని మెగాబ్రదర్ నాగబాబు పిలుపు ఇచ్చారు. సరిహద్దులలో మన దేశ భూభాగాలను ఆక్రమించుకోవాలని చూస్తున్న దేశ ఉత్పత్తులను బహిష్కరిద్దామని ఆయన అన్నారు. "చైనా ప్రొడక్ట్స్, చైనీస్ యాప్స్ ను బ్యాన్ చేద్దాం. మన దేశాన్ని ఆక్రమించుకోవలని చూస్తున్న చైనా వస్తువులను, సెల్ ఫోన్ యాప్స్.. అన్నిటినీ బహిష్కరిద్దాం" అని ఆయన పేర్కొన్నారు.
మన దేశంలో తయ్యారయిన వస్తువులనుకొంటే దేశం అభివృద్ధి చెందుతుందని, మన డబ్బు మన దేశంలోనే ఉంటుందని నాగబాబు అన్నారు. "ప్రపంచంలో మన దేశ మార్కెట్ అన్నిటికంటే పెద్ద మార్కెట్. అన్ని దేశాల వస్తువులు ఇక్కడ అమ్మి సొమ్ము చేసుకొని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. అదే మన ప్రొడక్ట్స్ ని మనమే కొంటే మన దేశమే లాభపడుతుంది. తిరిగి ఆ డబ్బుతో మన దేశం అభివృద్ధి చెందుతుంది. మనందరం బాగుపడతాం. మన డబ్బు మన దేశంలోనే ఉంటుంది. మనమే బాగుపడదాం. అంతే కానీ, మన డబ్బుతో బాగుపడి మన దేశాన్ని అక్రమించుకోవలని చూసే చైనా వస్తువులను బ్యాన్ చేద్దాం" అని నాగబాబు ట్వీట్ చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



